Skip to main content

సెయింట్ జోసెఫ్ కళాశాల, జ్ఞానాపురం , డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ లో “నేషనల్ సైన్స్ డే” సంబరాలు”

జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమంనేషనల్ సైన్స్ డే”(జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని) 

ఫిబ్రవరి 28న  పురస్కరించుకుని కళాశాల జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “విజ్ఞానంలో మహిళలు – వికసిత భారత్‌కు ప్రేరణ” అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ద్వారా విజ్ఞాన రంగంలో మహిళల పాత్ర, వారి కృషి మరియు దేశాభివృద్ధిలో వారి సేవలను విద్యార్థులకు పరిచయం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రముఖ మహిళా శాస్త్రవేత్తల వేషధారణలో పాల్గొని, వారి జీవిత విశేషాలు మరియు శాస్త్రానికి అందించిన విశిష్ట సేవలను వివరించారు. మహిళా శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు మరియు సమాజానికి అందించిన శాస్త్రీయ అవిష్కరణలను విద్యార్థులు చక్కగా వివరిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.

అధ్యాపకులు విజ్ఞాన రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగడం దేశ పురోగతికి ఎంత ముఖ్యమో వివరించారు. ఈ కార్యక్రమంలో జంతుశాస్త్ర విభాగాధిపతి డా. ఈ. హరిణి గారితో డా. రోసినా జార్జ్ ,డా. స్నేహ , డా. రామ్ కుమార్, పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు విజ్ఞాన పరిశోధనల పట్ల ఆసక్తి కనబరిచి, భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలని సంకల్పించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడగా, పాల్గొన్న విద్యార్థులు మరియు అధ్యాపకులను కళాశాల యాజమాన్యం అభినందించింది.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...