హెల్మెట్ ధారణ...ప్రాణాలకు రక్షణ..* - *ఏయూ ఉద్యోగుల హెల్మెట్ ఫర్ లైఫ్ బైక్ ర్యాలీ* - *అభినందించిన పోలీస్ కమీషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి*
ఆంధ్రవిశ్వవిద్యాలయం, ఫిబ్రవరి 24: నగర ప్రజల్లో హెల్మెట్ ధారణ పట్ల అవగాహన కల్పించే విధంగా ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్మెట్ ఫర్ లైఫ్ ర్యాలీని నగర పోలీస్ కమీషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మంగళవారం ప్రారంభించారు. ఏయూ పరిపాలనా భవనం నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ సిరిపురం కూడలి, ఆల్ ఇండియా రేడియో, ఆర్.కె బీచ్ మీదుగా ఏయూ కన్వెన్షన్ సెంటర్ వరకు సాగింది. ర్యాలీని ప్రారంభించిన అనంతరం పోలీస్ కమీషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ...ఇటువంటి* ప్రజోపయోగ కార్యక్రమాన్ని నిర్వహించిన ఏయూ యాజమాన్యాన్ని, అధికారులను, ఉద్యోగులను అభినందిస్తున్నామన్నారు. నో హెల్మెట్.. నో ఫ్యూయల్ నిబంధనను అమలు చేస్తున్నామన్నారు. పోలీసులకు సహకరిస్తూ ప్రతీ వ్యక్తి హెల్మెట్ ధరించాలన్నారు.హెల్మెట్ ధరిస్తే 88 శాతం వరకు తలకు గాయాలయ్యే ప్రమాదాన్ని నివారించడం జరగవవచ్చున్నారు. హెల్మెట్ ధారణ వలన 40 శాతం వరకు మరణాలు తగ్గుతాయన్నారు. ద్విచక్రవాహనాలు నడిపి వారు, వెనుక కూర్చునే వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరుతున్నామన్నారు. హెల్మెట్ ధరించడం.... సురక్షిత ప్రయాణం కొనసాగించండి అనే నినాదం ముందుకు తీసుకువెళ్లాలన్నారు. నాణ్యమైన హెల్మెట్ ధరించడం, సరిగ్గా ధరించడం ఎంతో ప్రధానమన్నారు.*ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ హెల్మెట్ ఫర్ ఆల్- సేవ్ లైఫ్... నినాదంతో ఏయూ విద్యార్థులు, ఉద్యోగుల భాగస్వామ్యంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు* . హెల్మెట్ ధరించడం వలన... ప్రాణాలను రక్షించడం వీలవుతుందన్నారు. ప్రతీ వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, సురక్షితంగా ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేసారు. శతాబ్ది ఉత్సవాలలో భాగంగా సమాజాన్ని అనుసంధానం చేసే కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నామన్నారు.*కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు, ప్రిన్సిపాల్స్ ఆచార్య జాలాది రవి, కె. సీతామాణిక్యం, డి. నగరాజ కుమారి, జి.గిరాజ శంకర్, విద్యార్ధి వ్యవహారాల డీన్ ఆచార్య ఎస్. హరనాథ్, పలువురు డీన్లు, అధికారులు, ఆచార్యులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.*
Dr Nanduri Ramakrishna sr Sub EDITOR




Comments
Post a Comment