శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గణేష్ కుమార్ కుటుంబం* .. *తిరుమలలో వాసుపల్లి సాకేత్, శ్రావణి నూతన దంపతులు*...
దక్షణ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రెండవ కుమారుడు వాసుపల్లి సాకేత్, శ్రావణి వివాహ వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నవ దంపతులతో వాసుపల్లి గణేష్ కుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారి వివాహ దాంపత్య జీవితం సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఇష్ట దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్నీ సందర్శించారు. స్వామివారి దర్శనం అనంతరం విశాఖకు బయలుదేరి రానున్నారు. తన కుమారుని వివాహ వేడుకలు హాజరైన పెద్దలకు, నేతలకు, కార్యకర్తలకు శ్రేయోభిలాషులకు కుటుంబ సభ్యులకి మరొకసారి వాసుపల్లి గణేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు

Comments
Post a Comment