అమలాపురం: విశాఖ సందేసం:పాఠశాల బస్సులకు అన్ని విధాల అర్హులైన వాహన చోధకులను మాత్రమే నియమిస్తూ పిల్లల భద్రత పట్ల అప్రమత్తతో వ్యవహరించాలని జిల్లా రవాణా అధికారి డి.శ్రీనివాసరావు పాఠశాల యాజమాన్యాలకు పేరెంట్ కమిటీ లకు సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ నందు స్కూలు కాలేజీ యాజమాన్యలు, విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీలు పోలీసు రవాణా విద్యా శాఖల సంయుక్త సమావేశం బడుల భద్రతా, బాధ్యత అంశంపై నిర్వహించారు
ఈ సందర్భంగా డి.టి.ఓ మాట్లాడుతూ పిల్లల భద్రత మొదటి ప్రధాన బాధ్యత తీసుకుంటూ బస్సు భద్రతా నిబంధనలు,పూర్తిగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌తో ఉండాలన్నారు. బ్రేకులు,టైర్లు,లైట్లు అన్నీ సరిగ్గా పనిచేయాలన్నారు. అత్యవసర ద్వారాలు,అగ్నిమాపక పరికరాలు తప్పని సరిగా ఉండాలన్నారు. సహాయక సిబ్బంది (అసిస్టెంట్),ఫస్ట్ ఎయిడ్ కిట్ తప్పని సరిగా ఉండాలన్నారు. డ్రైవర్లు, యాజమాన్యాల బాధ్యతలపై సమీక్షిస్తూ విద్యా సంస్థలు అనుభవజ్ఞులైన డ్రైవర్లను మాత్రమే నియమించాలని, అతివేగం, సెల్‌ఫోన్ ఉపయోగం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

Comments
Post a Comment