Skip to main content

అమలాపురం ప్రముఖ హోటల్లో కుళ్ళిన చికెన్ బిర్యానీ. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు తీరుపై ప్రజలు ఆగ్రహం . ..

 అమలాపురం, :విశాఖ సందేసం :ప్రస్తుత రోజుల్లో ఏమి తినేటట్లు లేదు అనడానికి నిదర్శనం అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం హోటల్స్ లో చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పాల కేంద్రాలే  కాకుండా ఫుడ్ సేఫ్టీ విషయలలో ముడుపులకు తలాగ్గుతున్నారా... అధికారానికి బయపడుతున్నారా అన్నా సందేహం కలుగుతుంది. ఏదైనా విషయం బయటకు వస్తే ఆ రెండు రోజులు అధికారులు హడావిడే తప్ప మళ్ళీ కన్నెత్తి చూడని ఫుడ్ సేఫ్టీ  అధికారులు.అమలాపురం గడియారం స్తంభం సెంటర్ దగ్గర్లో గల ప్రముఖ ఎ బి సి డి రెస్టారెంట్లో కుళ్ళిన మాంసంతో తయారుచేసిన బిర్యాని విక్రయాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన 

కస్టమర్..వీడియో వైరల్ గా మారడంతో రెస్టారెంట్ ను అమలాపురం మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించిన మున్సిపాలిటీ సిబ్బంది పలు ఆహార శాంపిల్స్ ను సేఖరించారు.  దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్విరాన్మెంటల్  ఏఈ కె వెంకటేష్, సానిటరీ ఇన్స్పెక్టర్ కుమార్ స్వామి తనిఖీలు నిర్వహించి ఫుడ్ నాణ్యతపై ఆరా తీశారు. ఏదైనా సంఘటన చోటుచేసుకున్న  సందర్భంలోనే  స్పందిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు...ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్లక్ష్యపు తీరుపై అంబేద్కర్ కోనసీమ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్ లో తనిఖీలు నిర్వహించాలని సామాజిక మధ్యమాలలో వీడియోను వైరల్ చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...