Skip to main content

*కల్తీ ఆహారంపై కఠిన చర్యలు తీసుకోండి – అధికారులకు ఎంపీ గురుమూర్తి ఆదేశాలు*

 రాష్ట్రంలో కల్తీ పాల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో తిరుపతి లోక్‌సభ సభ్యులు మద్దిల గురుమూర్తి జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజల ఆరోగ్యం అత్యంత ముఖ్యమని, ఆహార భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి జిల్లాలో ఎక్కడైనా కల్తీ పాలు లేదా కల్తీ ఆహార పదార్థాల విక్రయం జరుగుతుందనే అనుమానం ఉన్న ప్రాంతాల్లో వెంటనే ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిని ఆదేశించారు.

అంగన్వాడీ కేంద్రాలు, పాల సేకరణ కేంద్రాలు, డెయిరీలు, హోటళ్లు, స్వీట్లు తయారు చేసే దుకాణాలు, టీ స్టాళ్లు వంటి ప్రదేశాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి నమూనాలు సేకరించాలని సూచించారు. ల్యాబ్ పరీక్షల ద్వారా పాల నాణ్యతను నిర్ధారించి, కల్తీ నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని  కోరారు.

అదేవిధంగా, ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్‌ కి లేఖ రాశారు. కల్తీ ఆహార పదార్థాల తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. అవసరమైతే టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి నిరంతర తనిఖీలు చేయాలని అభిప్రాయపడ్డారు. ఒకటికి మించి నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారుల లైసెన్సులు రద్దు చేసే చర్యలు కూడా తీసుకోవాలని కోరారు.

ప్రజలకు కూడా ఆయన కొన్ని సూచనలు చేశారు. పాలు కొనుగోలు చేసే సమయంలో నాణ్యతపై శ్రద్ధ వహించాలని, అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తక్కువ ధరకు లభిస్తున్న పేరులేని పాల ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో జాగ్రత్త వహించాలని చెప్పారు. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా పాలు, పాల పదార్థాలు తీసుకుంటారని, వారి ఆరోగ్యాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీ ఉండదని ఎంపీ మద్దిల గురుమూర్తి స్పష్టం చేశారు. ప్రజారోగ్యం దృష్ట్యా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈ లెఖలో ఎంపీ కోరారు.

                   Sharma K.V.Editor

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...