రాజకీయ కలయిక కాదు.. ఇది కుటుంబాల కలయిక! కూటమి సహచరులపై లోకేష్ చాటుకున్న ప్రేమానురాగలకు నిదర్శనం : ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు
అమలాపురం:విశాఖ సందేసం:ఉభయ గోదావరి జిల్లాల కూటమి నేతలపై నారా లోకేష్ ఆత్మీయ జల్లు కురుపించి విందులో వెల్లివిరిసిన ప్రేమ, ఆప్యాయతలతో పరవశించిన కూటమి నేతల కుటుంబాలు...
ఉండవల్లి నారా లోకేష్ నివాసంలో గోదావరి ప్రజాప్రతినిధులకు అపురూప ఆతిథ్యంగా నిలిచింది.
మంగళవారం అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తన కుటుంబ సమేతంగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు, యువనేత నారా లోకేష్ ను ఉండవల్లిలోని అయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ భేటీ కేవలం ఒక అధికారిక కలయికలా కాకుండా, రెండు కుటుంబాల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని చాటిచెప్పింది. ఎమ్మెల్యే ఆనందరావు కుటుంబ సభ్యులతో లోకేష్ ఎంతో సాదాసీదాగా సంభాషించిన తీరు, ఆయనలోని సంస్కారానికి మరియు గొప్ప నాయకత్వ లక్షణాలకు నిదర్శనమని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. ఒక బిజీ షెడ్యూల్‌లో ఉండి కూడా, తన వారి కోసం సమయాన్ని కేటాయించి ఆత్మీయతను పంచడం లోకేష్ కే చెల్లిందని ఎమ్మెల్యే అన్నారు.ఆంధ్రప్రదేశ్ పురోగతికి అహర్నిశలు శ్రమిస్తున్న లోకేష్ అద్భుతమైన నాయకత్వంలో మన రాష్ట్రం మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే ఆనందరావు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు


Comments
Post a Comment