సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల లో “లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్ మ్యాథమేటికల్ సైన్సెస్” అంశం పై రెండు రోజుల జాతీయ వర్క్ షాపు
27 ఫిబ్రవరి సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల లో “లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్ మ్యాథమేటికల్ సైన్సెస్” అంశంపై సైన్స్ అకాడమీస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లెక్చర్ వర్క్‌షాప్ ఘనంగా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమాన్ని గణితశాస్త్రం, గణాంకశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ విభాగాలు మరియు IQAC సంయుక్త ఆధ్వర్యంలో యూజీ మరియు పీజీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించారు.ప్రారంభోత్సవానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. సిస్టర్ షైజి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ. జి. పి. రాజశేఖర్ ప్రధానోపన్యాసం చేశారు. వర్క్‌షాప్ కన్వీనర్ , విశిష్ట అతిథిగా బెంగళూరు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ కు చెందిన ప్రొ. గదాధర్ మిశ్రా పాల్గొన్నారు.
స్వాగత ప్రసంగాన్ని డా. క్యాప్ట్. కె. సుజాత, గణితశాస్త్ర & గణాంకశాస్త్ర విభాగాధిపతి అందించారు.
ముఖ్య అతిథి ప్రొ. జి. పి. రాజశేఖర్ గణిత శాస్త్రాల ప్రాధాన్యతను వివరించి, పరిశోధన మరియు అంతరశాఖా అన్వయాలలో గణితశాస్త్రం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. యూజీ, పీజీ విద్యార్థులు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల నుండి విచ్చేసిన ప్రముఖ ప్రొఫెసర్ల ఉపన్యాసాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రొ. గదాధర్ మిశ్రా గారు వర్క్‌షాప్ ఉద్దేశ్యాలను వివరించి, ఆధునిక గణితశాస్త్రంలో తాజా అభివృద్ధులను విద్యార్థులకు పరిచయం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.
తదుపరి సాంకేతిక సమావేశాలలోప్రొ. గదాధర్ మిశ్రా – ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, బెంగళూరు, ప్రొ. పి.డి.ఎన్. శ్రీనివాసు – ఆంధ్ర విశ్వవిద్యాలయం, డా. దుర్గాప్రసాద్ చల్లా ఐఐటీ తిరుపతి, ప్రొ. కె. శ్రీనివాస్ –ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటికల్ సైన్సెస్, చెన్నైఉపన్యాసాలు అందించారు.విద్యార్థులతో పాటు గణితశాస్త్రం, గణాంకశాస్త్రం మరియు కంప్యూటర్ సైన్స్ విభాగ అధ్యాపకులు చురుకుగా పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో గణిత అధ్యాపకులతో పాటు డా. కృష్ణ కుమారి, డా. పి కె జయలక్ష్మి, వీణ, డా. హరిణి, డా. సుధ, డా. సిస్టర్ హేమ పాల్గొన్నారు.




Comments
Post a Comment