ఈ సందర్భంగా నిర్వహించిన సంస్మరణ సభలో ఎంపీ మాట్లాడుతూ జానకిరామిరెడ్డి గారి మరణం వరగలి ప్రాంతానికే కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా తీరని లోటని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి, ప్రతి అంశాన్ని క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేస్తూ అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకుడిగా ఆయనను స్మరించారు.
వరగలి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం పూర్తికావడంలో జానకిరామిరెడ్డి గారి పాత్ర కీలకమని, చుట్టుపక్కల గ్రామాల దేవాలయాల పునర్నిర్మాణానికి ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ఎంపీ తెలిపారు. కొన్ని దేవాలయాలను ఎండోమెంట్ శాఖలో చేర్చే విషయమై కూడా ఆయన తనతో చర్చించిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు. జానకిరామిరెడ్డి చేసిన సేవలను స్మరిస్తూ ఎంపీ భావోద్వేగానికి గురయ్యారు.
తమ్మినపట్నం, లింగవరం గ్రామాల రహదారి అభివృద్ధి అంశంపై ఆయన నిరంతరం పట్టుదలతో కృషి చేశారని, లింగవరం పంచాయతీ పరిధిలో సుమారు రెండున్నర కోట్ల రూపాయలతో రోడ్డు పనులను మంజూరు చేసేలా చర్యలు చేపడుతున్నామని ఎంపీ వెల్లడించారు.
కండలేరు క్రీక్ పరిధిలో మోమిడి, వరగలి ప్రాంతాలు కోతకు గురవుతున్న సమస్యపై కూడా జానకిరామిరెడ్డి గారు ఆందోళన వ్యక్తం చేసి, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేయాలని సూచించారని తెలిపారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫండ్స్ కింద ఈ పనులు చేపట్టే దిశగా చర్చలు కొనసాగుతున్నాయని ఎంపీ చెప్పారు. తమ్మినపట్నం, లింగవరం గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణంపై కూడా ఆయన చివరి వరకు ఫాలోఅప్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు
ఈ అభివృద్ధి పనులన్నింటినీ పూర్తిచేసి ఆయన ఆశయాలను సాకారం చేయడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. ప్రజల కోసం నిరంతరం తపించిన ఆత్మీయుడు, సౌమ్యుడు, సేవాభావం కలిగిన నాయకుడిగా జానకిరామిరెడ్డి గారిని స్మరించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సభలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments
Post a Comment