Skip to main content

శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం, సింహాచలం – చందనోత్సవ ఏర్పాట్లపై సమీక్ష

విశాఖ సందేశం: సింహాచలం 24 ఫిబ్రవరి: 2026చందనోత్సవాన్ని అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు ఆలయ అధికారులు – జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఏర్పాట్లు.

జిల్లా కలెక్టర్. హరేంథిర ప్రసాద్  ఆలయ ఈవో జె.   వెంకటరావుతో కలిసి కొండపై జరుగుతున్న అభివృద్ధి పనులు, క్యూ లైన్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

* బారికేడింగ్‌తో సహా అన్ని సివిల్, నిర్మాణ పనులను మార్చి 31లోపు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి.

* సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ, సంతృప్తికరంగా దర్శనం కల్పించేలా చర్యలు.

* గతంలో గాలులు, వర్షాల వల్ల ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, క్యూ లైన్ల వెంబడి సాధ్యమైనంత వరకు శాశ్వత షెల్టర్లు ఏర్పాటు.

ఎలక్ట్రికల్ మరియు ఫైర్ సేఫ్టీ తనిఖీలు తప్పనిసరిగా నిర్వహించాలి.

* సాధారణ భక్తులకు ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10–11 గంటల వరకు దర్శనం కల్పించేలా ప్రణాళిక.

* VIP / VVIP దర్శనాలకు ఉదయం 3 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక టైమ్ స్లాట్లు కేటాయింపుకు మార్గదర్శకాలు.

ఉదయం 5 గంటలలోపు అంతరాలయ దర్శనాలు ముగించాలని ప్రాథమిక నిర్ణయం.

* ₹300, ₹1000, ₹1500 దర్శన క్యూ లైన్లు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రారంభించి, రద్దీ నియంత్రణకు పటిష్ట చర్యలు.

భక్తుల రాకపోకల కోసం బస్సుల నిర్వహణ, పికప్–డ్రాప్ పాయింట్లు, పార్కింగ్ ప్రాంతాలపై స్పష్టమైన ప్లాన్ సిద్ధం చేయాలని సూచనలు.

* ఆలయ ప్రాంగణంలోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేదు – పోలీస్ సిబ్బంది, సేవా వలంటీర్లతో నిరంతర పర్యవేక్షణ.

* ఈ ఏడాది సుమారు 1.20 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా.

* దర్శనం అనంతరం భక్తులు వేగంగా బయటకు వెళ్లేందుకు ఆగమశాస్త్రం ప్రకారం అదనపు ర్యాంపులు ఏర్పాటు.

* ప్రజాప్రతినిధులతో చర్చల అనంతరం, దర్శన సమయాలపై తుది నిర్ణయాన్ని మీడియా ద్వారా అధికారికంగా ప్రకటిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.    

సమీక్ష అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు వీరికి ఆలయ కార్య నిర్వహణ అధికారి జెబి వెంకటరావు స్వాగతం పలికి ముందుగా కప్పస్తంభమాలింగనము తదుపరి స్వామి వారి దర్శనము అనంతరము వేద పండితుల వేద ఆశీర్వచనము తదుపరి స్వామివారి ప్రసాదాలని అందజేశారు.

వీరితో ఆలయం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధ సహాయకార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు ఇంజనీరింగ్ అధికారులు, టూరిజం అధికారులు తదితరులు ఉన్నారు

                       కె. వి. శర్మ, ఎడిటర్,

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...