అమలాపురం, విశాఖ సందేసం...అమలాపురం మండలం కామనగరువు పంచాయతీ పరిధిలోని వి ఎస్ ఆర్ కాలనీ వద్ద ఎంజీ ఎన్ ఆర్ జి ఎస్ నిధులనుండి 46 లక్షల రూపాయలతో మేజర్ డ్రెయిన్ మరియు రోడ్డు పనులకు సర్పంచ్ నక్కా అరుణకుమారి చంద్రశేఖర్ శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు మెండు గంగా భవాని, 2వార్డు సభ్యులు జొన్నాడ పల్లాలమ్మ, 3వార్డు సభ్యులు గుత్తుల నాగేంద్ర, వాసంశెట్టి చినబాబు, అనిశెట్టి శ్రీను, కొప్పిశెట్టి కుమార్ బాబూ, పంచాయతీ సెక్రెటరీ ఆర్ ఎస్ ఎస్ సూరపరాజు, ఆదినారాయణ, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు
మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...

Comments
Post a Comment