విశాఖ: విశాఖ సందేశం: ఆఫీస్ మేనేజ్‌మెంట్ విభాగ పూర్వ అధ్యక్షులు కీర్తి శేషులుడి.ఏ. రమణి రచించిన“ది జాయ్స్ ఆఫ్ గివింగ్ అండ్ లివింగ్ – మెమరీస్ రీకౌంటెడ్” గ్రంథావిష్కరణ కార్యక్రమం ఫిబ్రవరి 26వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు జ్ఞానాపురంలోని సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాలలో ఘనంగా నిర్వహించబడింది.విశాఖపట్నం ఆర్చ్‌బిషప్ ఎమిరిటస్ మోస్ట్ రేవ్. ఎం. ప్రకాష్ గ్రంథాన్ని ఆవిష్కరించారు. అనంతరం మొదటి ప్రతిని రమణి తల్లి గారికి అందజేశారు. ఈ సందర్భం సభలో భావోద్వేగ వాతావరణాన్ని నెలకొల్పింది.
కళాశాల ప్రిన్సిపాల్ డా. సిస్టర్ షైజీ, ప్రొవిన్షియల్ సుపీరియర్ సిస్టర్ మార్గరెట్ మేరీ తదితరులు రమణి కళాశాలకు అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. ఆమె క్రమశిక్షణ, అంకితభావం, విద్యార్థుల పట్ల చూపిన మమకారం గురించి విశదీకరించారు.
రమణి ధనరాజ్ సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాలలో 36 సంవత్సరాల పాటు విశేష సేవలందించారు. ఆమె ఇటీవల క్యాన్సర్ వ్యాధితో కన్నుమూశారు. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమె సహోదరులు ఈ గ్రంథాన్ని విడుదల చేశారు.
కె. వి. శర్మ, ఎడిటర్,




Comments
Post a Comment