Skip to main content

అంగరంగ వైభవంగా "వాసుపల్లి" వారి పెళ్లి సందడిగాయత్రి విద్యా పరిషత్ క్వాంటమ్ కంప్యూటింగ్ పై మూడు రోజుల జాతీయ సదస్సు విజయవంతంగా నిర్వహణ

                         అంగరంగ వైభవంగా "వాసుపల్లి" వారి పెళ్లి సందడి

* ఒక్కటైనా వాసుపల్లి సాకేత్, శ్రావణిల జంట 

*  రాజకీయాలకతీతంగా తరలివచ్చిన నేతలు 

* జిల్లా కలెక్టర్, కమిషనర్ తో సహా పలువురి ప్రముఖులు హాజరు..

★ పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు 

★ మంచి మనసుతో ఆశీర్వాదం

★ ఉత్సాహ వాతావరణంలో  ఇందిరా ప్రియదర్శిని స్టేడియం

అతిరథ మహారధులు తరలివచ్చారు.నాయకుల నుంచి కార్యకర్తల వరకు అభిమానుల నుంచి ప్రజలు వరకు తరలివచ్చి తమ అభిమానాన్ని చూపించి,

నూతన వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

తమ ప్రియతమ నాయకుడు, పేదల పెన్నిధి, అందరికీ ఆప్తులు, నిస్వార్థ సేవకుడు , విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ రెండో కుమారుడు వివాహ రిసెప్షన్  కన్నుల పండువుగా జరిగింది.

ఈ పండుగకు వెలంపేట లో గల జీవీఎంసీ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదిక అయింది. మంగళవారం రిసెప్షన్ కాగా బుధవారం ఉదయం 10.11 నిమిషాల ముహూర్తాన ఆ జంట ఒకటయ్యారు. స్పీకర్ తో సహా రాజకీయాలకు అతీతంగా పలువురు ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు, పలువురు ఉన్నతాధికారులు, అధికారులు వివాహ వేడుకలకు హాజరయ్యారు.  తదితర పెద్దలతో సహా జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ తదితర ప్రముఖులు హాజరై దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. ముందుగా జరిగిన రిసెప్షన్ వేడుకలు అంబరాన్నంటాయి.  

ఈ సందర్భంగా పలు రకాల ఉత్తరాది, దక్షిణ వంటకాలతో ఏర్పాటు చేసిన విందు అందరిని కనువిందు చేసింది.

వాసుపల్లి గణేష్ కుమార్ స్వయంగా తన కుమారుడి వివాహానికి హాజరు కావాలంటూ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, మీడియా ప్రతినిధులకు,  మీడియా సంస్థలకు ఆహ్వానాలు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు వివిఐపీలు, వీఐపీలు, పలు రాజకీయ పార్టీల నాయకులు, వైసిపి శ్రేణులు పాల్గొనడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరూ పెద్ద మనసుతో నూతన వధూవరులను మనసారా ఆశీర్వదించడం జరిగింది. దీంతో వేదిక వద్ద పండుగ వాతావరణం నెలకొంది.

ఉత్సాహ వాతావరణంలో ఈ కార్యక్రమం ఆద్యంతం జరిగింది.

తన కుమారుని రిసెప్షన్, వివాహ వేడుకలకు కు హాజరై మంచి మనసుతో ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...