Skip to main content

విశాఖపట్నం బివీకే జూనియర్ కళాశాల విశాలాక్షినగర్ కరస్పాండంట్ గా ప్రముఖ కవి,విద్యావేత్త డాక్టర్ నండూరి రామకృష్ణ ను

 విశాఖపట్నం బివీకే జూనియర్ కళాశాల విశాలాక్షినగర్  కరస్పాండంట్ గా ప్రముఖ కవి,విద్యావేత్త డాక్టర్ నండూరి రామకృష్ణ ను నియమిస్తూ బుధవారం భారతీయ విద్యాకేంద్రం సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేసారు.ఈ సందర్భంగా డాక్టర్ నండూరి రామకృష్ణ మాట్లాడుతూ తనకు అప్పగించిన భాద్యతలను నిబద్దతతో,నిజాయతీగా నిర్వహిస్తానని తెలిపారు. భారతీయ విద్యాకేంద్రం ప్రతిష్ట పెంచేవిధంగా,జూనియర్ కళాశాల అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు.భారతీయ విద్యాకేంద్రం లక్ష్యాలు,సిద్ధాంతాలకు ఎటువంటి భంగం కలుగకుండా సంస్థ పేరు ప్రఖ్యాతులు మరింత పెంపొందించే విధంగా తన భాద్యతలు నిర్వహిస్తానని డాక్టర్ నండూరి రామకృష్ణ తెలిపారు.ఈ సందర్భంగా పలువురు డాక్టర్ నండూరి రామకృష్ణ కు అభినందనలు తెలిపారు.

                      కె. వి. శర్మ, ఎడిటర్,

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...