Skip to main content

Press Note *భారతీయ జనతా పార్టీ జనతా వారధి ఉత్తరాంధ్ర కార్యాలయంలో వినతులు స్వీకరించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు*

ఈరోజు 27-02-2026 శుక్రవారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సారధ్యంలో జరుగుతున్న జనతా వారధి ప్రజలకు ప్రభుత్వానికి వారధి కార్యక్రమం లో భాగంగా బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు గారి ఆధ్వర్యంలో జనతా వారధి ఉత్తరాంధ్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డా రెడ్డి పావని గారు ప్రజల నుండి వినతులు స్వీకరించారు.

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు మాట్లాడుతూ ప్రజలకు ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలను అర్జీలను స్వీకరించి

 ఈ జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ జనతా వారధి కార్యాలయంలో ప్రతి శుక్రవారం ఒక MLA అందుబాటులో ఉంటూ ప్రజల నుండి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

ఈ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేతినేని సురేంద్ర మోహన్, శ్రీమతి ఉమ్మిడి సుజాత రాజ్, బీజేపీ జనతా వారధి కో కన్వీనర్ మూల వెంకటరావు, G ప్రేమ కుమారి తోపాటు పలువురు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...