*వైభవంగా గడుగుపల్లి భగవాన్ శ్రీ సత్యసాయి ప్రేమామృత సేవా నిలయం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు -నిరుపేద గిరిజన మహిళలకు కుట్టు యంత్రాలను అందచేసిన శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ R. లక్ష్మణరావు*
ఈ సందర్భంగా ప్రధాన ఆకర్షణగా, హుకుంపేట మండలం అండిబ గ్రామంలో శ్రీ సత్యసాయి శత జయంతి ప్రేమామృతధార త్రాగునీటి ప్రాజెక్ట్‌ను, శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు గారు ప్రారంభించారు.
ఈ త్రాగునీటి ప్రాజెక్ట్ ద్వారా గిరిజన కుటుంబాలకు సురక్షిత త్రాగునీటి సౌకర్యం లభించి గ్రామస్తుల్లో అపార ఆనందం, కృతజ్ఞత వెల్లివిరిసింది.
గ్రామస్తులు సంప్రదాయ ధింసా నృత్యంతో ఘన స్వాగతం పలికారు. రంగురంగుల చీరలు, పూల అలంకరణతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది.స్వయం ఉపాధి, ఆర్థిక స్వాతంత్య్రం , మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ, ఉచిత టైలరింగ్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన నిరుపేద గిరిజన మహిళలకు కుట్టు యంత్రాలను శ్రీ లక్ష్మణరావు గారు అందజేశారు. నూతనంగా సంపాదించిన నైపుణ్యాలను సమర్థవంతంగా వినియోగించుకొని మెరుగైన జీవనోపాధిని పొందాలని, ఇతరులకు సహాయం చేయాలని శ్రీ లక్ష్మణరావు గారు ప్రోత్సహించారు.తన పర్యటనలో భాగంగా శ్రీ లక్ష్మణరావు గారు శ్రీ సత్యసాయి గిరిజన సేవా నిలయంలో జరుగుతున్న మహిళలు, యువతకు సంబంధించిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర అధ్యక్షులు సమీక్షించి, గిరిజన సమాజాభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తున్నఅల్లూరి సీతారామరాజు జిల్లా శ్రీ సత్య సాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ గణేష్ మరియు వారి బృందాన్ని అభినందించారు.ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్లు, జోనల్ కోఆర్డినేటర్లు, భజన మండలి కన్వీనర్లు, యువజన సమన్వయకర్తలు (పురుష, మహిళ)తో పాటు మొత్తం 500 పైగా సభ్యులు పాల్గొని ఈ వేడుకను ఆధ్యాత్మికంగా, సంస్థాగతంగా విశిష్ట కార్యక్రమంగా మలిచారు.





Comments
Post a Comment