Skip to main content

జారీచేసినవారు: డా.ఆర్.రమేష్, ఇన్చార్జ్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 04.03..2026

తేదీ 03.03.2026 న ప్రపంచ వినికిడి దినోత్సవం 2026 సందర్భంగా ఈరోజు ఇంచార్జీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఆర్ రమేష్ వారు మరియు జిల్లా ప్రోగ్రాం అధికారులు, సిబ్బందితో కలిసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి సత్యం కూడలి మీదుగా ర్యాలీ నిర్వహించారు. తదుపరి ఇంచార్జీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు మాట్లాడుతూ విశాఖపట్నం :  "సమాజం నుండి తరగతి గదుల వరకు: పిల్లలందరికీ వినికిడి సంరక్షణ" (From communities to classrooms: hearing care for all children) అనే ఇతివృత్తంతో (theme) పిల్లలలో వినికిడి లోపాన్ని నివారించడానికిముందస్తు గుర్తింపును ప్రోత్సహించడానికి జరుపుకుంటారు. 60% పైగా వినికిడి సమస్యలను నివారించవచ్చని ఈ ప్రచారం చెబుతుంది. 

ఉద్దేశ్యం: పిల్లలలో వినికిడి లోపాన్ని ముందుగానే గుర్తించడం (early identification) మరియు నివారించడం.60% కంటే ఎక్కువ చిన్నపిల్లల వినికిడి సమస్యలను సులభమైనతక్కువ ఖర్చుతో కూడిన పబ్లిక్ హెల్త్ చర్యల ద్వారా నివారించవచ్చు

వినికిడి సామర్థ్యం తగ్గడానికి ప్రధాన కారణాలు:అధ్యయనాల ప్రకారం.. వినికిడి లోపం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. వీటిని సమయానికి నియంత్రించకపోతే త్వరలోనే ప్రపంచంలోని మెజారిటీ ప్రజలు వినికిడి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

అంటు వ్యాధులు: చెవి ఇన్ఫెక్షన్లు, మెనింజైటిస్, తట్టు, ఇతర వ్యాధులు వినికిడి సామర్థ్యాన్ని శాశ్వతంగా దెబ్బతీస్తాయి.

జన్యుపరమైన కారణాలు: కొందరిలో పుట్టినప్పటి నుండే వినికిడి సామర్థ్యం బలహీనంగా ఉంటుంది. ఇది కాలక్రమేణా పెరుగుతుంది.

ధ్వని కాలుష్యం- భారీ శబ్దాలు: ట్రాఫిక్ శబ్దం, ఫ్యాక్టరీల శబ్దం, లౌడ్ మ్యూజిక్, ఇయర్ ఫోన్లు. ఎక్కువ కాలం భారీ శబ్దాల మధ్య ఉండటం వల్ల చెవి నరాలు శాశ్వతంగా దెబ్బతింటాయి.

హెడ్‌ఫోన్లు- స్మార్ట్‌ఫోన్ల అధిక వినియోగం: 12 నుండి 35 సంవత్సరాల వయస్సు గల ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది యువకులు హెడ్‌ఫోన్లను అధిక శబ్దంతో వాడుతున్నారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఇది భవిష్యత్తులో తీవ్రమైన వినికిడి సంక్షోభాన్ని సృష్టించవచ్చు.

అన్-హెల్తీ లైఫ్ స్టైల్: ధూమపానం, రక్తపోటు, పోషకాహార లోపం కూడా వినికిడి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి.

పిల్లల్లో నివారణ సాధ్యం.. కానీ యువతలో ముప్పు ఎక్కువ ,పిల్లలలో సుమారు 60% వినికిడి సమస్యలను నివారించవచ్చు. ఉదాహరణకు సమయానికి టీకాలు వేయించడం.మెరుగైన తల్లి, శిశు సంరక్షణ.చెవి ఇన్ఫెక్షన్లకు వెంటనే చికిత్స అందించడం.కానీ యువతలో అతిపెద్ద ముప్పు బిగ్గరగా వినే సంగీతం, హెడ్‌ఫోన్ల వాడకం. చాలాసార్లు ఒత్తిడి మితిమీరడం వల్ల ‘టిన్నిటస్’ (చెవుల్లో హోరు) సమస్యకు దారితీస్తుంది.వినికిడి సామర్థ్యం తగ్గడం వల్ల సామాజిక, మానసిక ప్రభావం వినికిడి సమస్య కేవలం చెవికి మాత్రమే పరిమితం కాదు. దీనివల్ల తీవ్రమైన సామాజిక, మానసిక పరిణామాలు ఉండవచ్చు. ఉదాహరణకు విద్యకు ఆటంకం కలగవచ్చు.ఉద్యోగ అవకాశాలు తగ్గవచ్చు.సామాజిక జీవితం దెబ్బతింటుంది.డిప్రెషన్, మానసిక ఒత్తిడితో పాటు ఇతరులతో సంభాషించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే దీనిని ప్రజారోగ్యం, సామాజిక అభివృద్ధికి ఒక పెద్ద సవాలుగా పరిగణిస్తుంది.

  ఈ కార్యక్రంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. హారిక  , ఇతర ప్రోగ్రామ్ ఆఫీసర్ మరియు కార్యాలయ సిబ్బంది అందరూ పాల్గొన్నారు.

         జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (ఇన్చార్జ్)

                                    విశాఖపట్నం

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...