Skip to main content

1 "విశాఖపట్నం మెట్రోపాలిటన్ ప్రాంతంలో నీటి రంగంలో మూలధన పెట్టుబడి ప్రణాళికపై విశాఖలో ఉన్నత స్థాయి వర్క్‌షాప్ నిర్వహించిన జీవీఎంసీ కమిషనర్." • వర్క్ షాప్ లో పాల్గొన్న నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి మరియు విశాఖ ఎకనామిక్ రీజియన్ (VER) సీఈఓ డా. ఎన్. యువరాజ్, పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ .సురేష్ కుమార్, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ పి.సంపత్ కుమార్, విశాఖ జిల్లా కలెక్టర్ ఎమ్ఎన్. హరేందిర ప్రసాద్, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండుకర్. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కిషోర్ ( నీతి ఆయోగ్), విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ జి .విద్యాధరి * వర్క్ షాప్ లో వాటర్ సెక్యూరిటీ ప్లాన్ పై పలు అంశాలను వివరించిన వరల్డ్ బ్యాంక్ గ్రూప్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (IFC), సింగపూర్ వాటర్ సెంటర్ (SWC) మరియు PUB కన్సల్టెంట్స్ (సింగపూర్) సంస్థల ప్రతినిధులు.

 

విశాఖపట్నం, మార్చి 10:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకత్వంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) ఆధ్వర్యంలో “విశాఖపట్నం మెట్రోపాలిటన్ ప్రాంతంలో నీటి రంగంలో మూలధన పెట్టుబడి ప్రణాళిక (Capital Investment Planning for the Water Sector)” పై ఒక కీలక వర్క్‌షాప్‌ను మంగళవారం విశాఖపట్నంలోని నోవోటెల్ హోటల్‌లో నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి మరియు విశాఖ ఎకనామిక్ రీజియన్ (VER) సీఈఓ డా. ఎన్. యువరాజ్, పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ .సురేష్ కుమార్, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ పి.సంపత్ కుమార్, విశాఖ జిల్లా కలెక్టర్ ఎమ్ఎన్. హరేందిర ప్రసాద్  లతో కలసి నిర్వహించడమైనదని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్  మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కార్యదర్శి మరియు విశాఖ ఎకనామిక్ రీజియన్ (VER) సీఈఓ డా. ఎన్. యువరాజ్ (ఐఏఎస్) ముఖ్య అతిథిగా హాజరైన ఈ వర్క్‌షాప్‌లో అంతర్జాతీయ నిపుణులు, అభివృద్ధి భాగస్వాములు మరియు జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొని, విశాఖపట్నం ప్రాంతానికి దీర్ఘకాలిక నీటి భద్రత కోసం వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికపై చర్చించారన్నారు.

ఈ కార్యక్రమాన్ని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) ఆధ్వర్యంలో, వరల్డ్ బ్యాంక్ గ్రూప్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (IFC) విక్టోరియా హిల్డా రిక్ బై డెల్మన్న్ ,సింగపూర్ వాటర్ సెంటర్ (SWC) జీన్ మార్టిన్ బ్రాల్ట్, PUB కన్సల్టెంట్స్ (సింగపూర్) జూ చై యంగ్, యూరోపియన్ డెలిగేషన్ టు ఇండియా , భూటాన్ యొక్క  డెల్ ఫైన్  బ్రిస్సోన్, సిడ్నీ యూనివర్సిటీ పియర్,ముఖ్ బేర్ లు పాల్గొనగా ఆయా సంస్థల సహకారంతో నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌లో  అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, సీనియర్ విధాన నిర్ణేతలు, పట్టణ నీటి నిర్వహణ నిపుణులు, సాంకేతిక నిపుణులు పాల్గొని పట్టణ నీటి వ్యవస్థలో సమగ్ర ప్రణాళిక, విధాన సమన్వయం మరియు డేటా ఆధారిత పెట్టుబడి వ్యూహాలపై చర్చలు జరిపారన్నారు.

ఈ కార్యక్రమంలో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ ఎస్. సురేష్ కుమార్ (ఐఏఎస్) వర్చువల్ గా పాల్గొని మాట్లాడుతూ, నీటి రంగంలో సమగ్ర మూలధన పెట్టుబడి ప్రణాళికను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి విధాన సహాయం, సంస్థాగత బలోపేతం మరియు ఆర్థిక మద్దతు అందిస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన క్రింది అంశాలను ప్రస్తావించారు:

• మున్సిపల్ బాండ్లు, బ్లెండెడ్ ఫైనాన్స్, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాలు (PPP), వియబిలిటీ గ్యాప్ ఫండింగ్, పనితీరు ఆధారిత ఒప్పందాలు వంటి వినూత్న ఆర్థిక వనరుల అన్వేషణ.

• విశాఖపట్నం నగరానికి సార్వభౌమ హామీలు లేకుండానే గ్లోబల్ పెట్టుబడులను సమీకరించడంలో IFC సాధించిన విజయాన్ని మరింతగా వినియోగించడం.

• GVMC, IFC, SWC మరియు PUB కన్సల్టెంట్స్ సంస్థల సహకారంతో సమగ్ర వ్యూహాలను రూపొందించడం.

• ప్రాజెక్టు నిర్వహణ, నిర్వహణ మరియు నిర్వహణ (O&M) సామర్థ్యాల పెంపు, ఆదాయ వనరుల మెరుగుదల కోసం జీవీఎంసీలో సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించడం.

• సమగ్ర పట్టణ నీటి నిర్వహణలో విశాఖపట్నాన్ని దేశానికి ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడం.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,

నీరు కేవలం ఒక పౌర సేవ మాత్రమే కాదు — విశాఖపట్నం మరియు మొత్తం విశాఖ ఎకనామిక్ రీజియన్ ఆర్థికాభివృద్ధికి ఇది బలమైన పునాది. ఐటీ పార్కులు, పరిశ్రమలు, గృహ నిర్మాణాలు, పర్యాటక రంగ అభివృద్ధి అన్నీ స్థిరమైన నీటి సరఫరాపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రపంచ స్థాయి సంస్థలతో భాగస్వామ్యంతో భారత నగరాలు నీటి భద్రతను ఎలా సాధించవచ్చో విశాఖపట్నం ఒక ఆదర్శంగా నిలవాలి.” అని తెలిపారన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కార్యదర్శి మరియు విశాఖ ఎకనామిక్ రీజియన్ (VER) సీఈఓ డా. ఎన్. యువరాజ్ మాట్లాడుతూ విశాఖపట్నం మెట్రోపాలిటన్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక మరియు పట్టణ కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి భద్రత (Water Security) పై సమగ్ర ప్రణాళిక అవసరం ఎంతో కీలకమని తెలిపారు. విశాఖపట్నం నగరానికి దీర్ఘకాలిక నీటి భద్రతను కల్పించేందుకు జీవీఎంసీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సంస్థల సహకారంతో నిర్వహిస్తున్న ఈ వర్క్‌షాప్ ఎంతో ప్రాముఖ్యత కలిగినదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఉత్తమ విధానాలను అవలంబించి నగరానికి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సమర్థవంతమైన నీటి నిర్వహణ ప్రణాళిక రూపొందించవచ్చని తెలిపారన్నారు.

మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ & డైరెక్టర్ డా. పి. సంపత్ కుమార్ మాట్లాడుతూ

• పట్టణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక నీటి వనరుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది అని తెలిపారు.

• అంతర్జాతీయ భాగస్వామ్య సంస్థలు అయిన IFC, సింగపూర్ వాటర్ సెంటర్, PUB సింగపూర్, ISF ఆస్ట్రేలియా సహకారంతో రూపొందిస్తున్న విశాఖపట్నం వాటర్ సెక్యూరిటీ ప్లాన్ నగరానికి భవిష్యత్తులో నీటి అవసరాలను సమర్థంగా నిర్వహించడానికి మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు.

• నీటి వనరులు, సరఫరా వ్యవస్థలు, నీటి సంరక్షణ, పునర్వినియోగం, భవిష్యత్ అవసరాల అంచనా వంటి అంశాలను సమగ్రంగా పరిగణలోకి తీసుకొని ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

• ఈ వర్క్‌షాప్ ద్వారా ముఖ్య పెట్టుబడి అవసరాలు, విభాగాల మధ్య సమన్వయం, దీర్ఘకాలిక ప్రణాళికలు స్పష్టంగా రూపొందుతాయని తెలిపారు.

విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖపట్నం నగరంలో నీటి భద్రత (Water Security) ఎంతో ముఖ్యమైన అంశమనని, పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక అభివృద్ధి మరియు పట్టణీకరణ నేపథ్యంలో నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడం మరియు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయడం అత్యంత అవసరం అన్నారు.ఈరోజు నిర్వహిస్తున్న "క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఫర్ ది వాటర్ సెక్టర్ ఇన్ విశాఖపట్నం"  (Capital Investment Planning for the Water Sector in Visakhapatnam” )వర్క్‌షాప్ ద్వారా ప్రభుత్వ శాఖలు, పరిశ్రమలు మరియు నిపుణులు విశాఖలో ఒకే వేదిక పై కలిసి నీటి రంగంలో భవిష్యత్ పెట్టుబడులు, సేవల విస్తరణ, మరియు సుస్థిర నీటి నిర్వహణపై చర్చించటం అభినందనీయమన్నారు.

విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్ నీటి వనరులను సంరక్షించడం, సమర్థవంతంగా వినియోగించడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రజలు, సంస్థలు మరియు అన్ని వర్గాల భాగస్వామ్యంతో సాధ్యమవుతుంది. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, నీటి వినియోగంలో మితవ్యయం మరియు సమగ్ర ప్రణాళికల ద్వారా భవిష్యత్ తరాలకు నీటి భద్రతను కల్పించవచ్చునన్నారు.

విశాఖపట్నం నగరం ఎప్పటికప్పుడు సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ముందంజలో ఉందని సమగ్ర వాటర్ సెక్యూరిటీ ప్లాన్ రూపకల్పన మరియు అమలు ద్వారా నగరానికి అవసరమైన నీటి వనరులను పరిరక్షించడంతో పాటు దీర్ఘకాలికంగా స్థిరమైన నీటి సరఫరాను అందించగలుగుతామన్నారు.

జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ విశాఖపట్నం మెట్రోపాలిటన్ ప్రాంతానికి దీర్ఘకాలిక నీటి భద్రతను సాధించేందుకు జీవీఎంసీ కట్టుబడి ఉందని తెలిపారు.

• విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక మరియు ఆర్థిక కేంద్రం కావడంతో భవిష్యత్‌లో నీటి అవసరం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.

• నగరానికి అవసరమైన ప్రస్తుత నీటి వనరులు, భవిష్యత్ అవసరాలు, వాతావరణ మార్పుల ప్రభావం వంటి అంశాలను శాస్త్రీయంగా అంచనా వేసే లక్ష్యంతో ఈ వాటర్ సెక్యూరిటీ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు.

• ఈ ప్రణాళిక రూపకల్పనలో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (IFC), సింగపూర్ వాటర్ సెంటర్, పబ్ సింగపూర్, ఐఎస్ఎఫ్ ఆస్ట్రేలియా వంటి అంతర్జాతీయ సంస్థల సహకారం అందుతున్నదని చెప్పారు.

• నీటి సంరక్షణ, మలిన జలాల పునర్వినియోగం, భూగర్భ జలాల పరిరక్షణ, సమర్థవంతమైన నీటి పంపిణీ వ్యవస్థ వంటి అంశాలపై సమగ్ర నీటి నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

• ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డేటా ఆధారిత ప్రణాళికల ద్వారా నీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం మరియు నీటి నష్టాలను తగ్గించడం లక్ష్యంగా పని చేస్తున్నామని పేర్కొన్నారు.

• ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో విశాఖపట్నాన్ని నీటి భద్రత కలిగిన, స్థిరమైన నగరంగా అభివృద్ధి చేయడం లక్ష్యమని తెలిపారు.

• ప్రభుత్వ విభాగాలు, పరిశ్రమలు, నిపుణులు మరియు ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర నీటి భద్రత రోడ్ మ్యాప్ సిద్ధం చేయనున్నామని అన్నారు.

• విశాఖపట్నం వాటర్ సెక్యూరిటీ ప్రణాళిక దేశంలోని ఇతర నగరాలకు కూడా మాదిరిగా నిలిచే నమూనా ప్రణాళికగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అభివృద్ధి దిశగా వేగంగా ఎదుగుతున్న విశాఖపట్నం – పెరుగుతున్న నీటి అవసరాలు

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (VER) ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రధాన అభివృద్ధి కేంద్రాలలో ఒకటిగా గుర్తించారు. అమరావతి, తిరుపతి నగరాలతో పాటు విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్న ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది.

ప్రపంచ స్థాయి పోర్ట్ ఆధారిత అభివృద్ధి, తదుపరి తరం ఐటీ రంగం, ఫార్మా, ఆరోగ్య సేవలు, పర్యాట

కం, ప్రణాళికాబద్ధ పట్టణ అభివృద్ధి మరియు ఆధునిక మౌలిక సదుపాయాలు వంటి ఏడు ప్రధాన అభివృద్ధి స్తంభాలు విశాఖ అభివృద్ధికి కీలకంగా నిలుస్తున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ స్థిరమైన నీటి సరఫరాపైనే ఆధారపడి ఉన్నాయి.

గూగుల్ ఏఐ డేటా సెంటర్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, ఫార్మా సిటీ, ఐటీ ప్రత్యేక ఆర్థిక మండలాలు (SEZs) మరియు సుమారు 7.5 లక్షల కొత్త గృహ నిర్మాణాలు వంటి భారీ ప్రాజెక్టులు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో, నీటి వనరులపై వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళిక అత్యవసరంగా మారింది.

ప్రస్తుతం విశాఖపట్నం నగరానికి సుమారు 400 మిలియన్ లీటర్లు ప్రతిరోజు (MLD) నీటి అవసరం ఉండగా, 2040 నాటికి ఈ అవసరం దాదాపు 726 MLD కు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

సమగ్ర ప్రణాళిక – సింగపూర్ విజయవంతమైన నమూనా:

ప్రాజెక్టు ఆధారిత పెట్టుబడులకంటే సమగ్ర పట్టణ నీటి నిర్వహణ వ్యవస్థను అమలు చేయాల్సిన అవసరాన్ని ఈ వర్క్‌షాప్‌లో నిపుణులు ప్రస్తావించారు. నీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ, పునర్వినియోగం, రీసైక్లింగ్ మరియు వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలను సమగ్రంగా పరిగణించాల్సిన అవసరాన్ని వివరించారు.

సింగపూర్ అమలు చేస్తున్న “ఫోర్ నేషనల్ టాప్స్” (Four National Taps) వ్యూహాన్ని విజయవంతమైన నమూనాగా చర్చించారు. ఇందులో స్థానిక వర్షపు నీటి వనరులు, దిగుమతి నీరు, శుద్ధి చేసిన మురుగు నీటి పునర్వినియోగం (NEWater), సముద్ర జలాన్ని ఉప్పుతీసే ప్రక్రియ (Desalination) వంటి నాలుగు ప్రధాన నీటి వనరులను వినియోగించడం జరుగుతోంది.

నీటి వనరుల విభిన్నీకరణ, శుద్ధి చేసిన మురుగు నీటి పునర్వినియోగం, నాన్-రెవెన్యూ వాటర్ తగ్గింపు, నగరానికి సమగ్ర నీటి సమతుల్య ప్రణాళిక (Water Balance), వాతావరణ మార్పులకు అనుగుణమైన మౌలిక సదుపాయాల ప్రణాళిక వంటి అంశాలు వర్క్‌షాప్‌లో ప్రధానంగా చర్చించబడ్డాయి.

అనంతరం అందరూ కలిసి జీవీఎంసీ రూపొందించిన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఫర్ ది వాటర్ సెక్టార్ ఇన్ విశాఖపట్నం ప్లేయర్ ను ఆవిష్కరించారు. ఈ వర్క్‌షాప్‌లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, నర్సీపట్నం కమిషనర్లు, అధికారులు, ఇతర పరిశ్రమల ప్రతినిధులు, జీవీఎంసీ అదనపు కమిషనర్లు ఎస్ఎస్ వర్మ, డివి రమణమూర్తి, ప్రధాన ఇంజనీరు పీవీ సత్యనారాయణ రాజు, పర్యవేక్షక ఇంజనీర్ ఏడుకొండలు,ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

పౌర సంబంధాల అధికారి,జీవీఎంసీ

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...