విశాఖపట్నం మార్చి 02: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (PGRS) కార్యక్రమంలో జీవీఎంసీ లో అన్ని విభాగాలకు కలిపి 103 వినతులు వచ్చాయని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన జివిఎంసి ప్రధాన కార్యాలయం పాత సమావేశ మందిరం లో అదనపు కమిషనర్లు డి.వి.రమణమూర్తి, ఎస్.ఎస్.వర్మ లతో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న“ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి జివిఎంసికి సంబంధించి 103 అర్జీలు / ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. అందులో ముఖ్యంగా భీమిలి జోన్ కు 01, మధురవాడ జోన్ కు 16, ఈస్ట్ జోన్ కు 22, వెస్ట్ జోన్ కు 04, నార్ట్ జోనుకు 18, సౌత్ జోన్ కు 08, పెందుర్తి జోన్ కు 13, గాజువాక జోన్ కు 10 జివిఎంసి ప్రధాన కార్యాలయానికి 11 ఫిర్యాదులు అందాయని తెలిపారు. జివిఎంసి అడ్మినిస్ట్రేషన్ & అకౌంట్సు విభాగమునకు 05, రెవెన్యూ విభాగమునకు 16, ప్రజారోగ్య విభాగమునకు 05, పట్టణ ప్రణాళిక విభాగమునకు 51, ఇంజినీరింగు విభాగమునకు 19, మొక్కల విభాగమునకు 03, యుసిడి విభాగమునకు 04 కలిపి మొత్తంగా 103 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.
అనంతరం నగర మేయర్ మాట్లాడుతూ ఫిర్యాదులకు సంబంధించిన విభాగాధిపతులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను/ఫిర్యాదులను అదే రోజు వెంటనే పరిశీలిస్తూ, సంబంధిత ఫిర్యాదు దారులతో సంప్రదించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, వచ్చిన అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి కార్యాచరణ అదే రోజు చేపట్టాలని, ప్రతివారం అదే ఫిర్యాదులు తిరిగి ప్రజలు సమర్పించకుండా ఆయా సమస్యలను నిర్ణీత సమయం లో పరిష్కరించాలని జివిఎంసి అధికారులను, జోనల్ కమీషనర్లను ఆదేశించారు.
అనంతరం జీవీఎంసీ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జోన్ల జోనల్ కమిషనర్లు, ఉన్నతాధికారులతో మాట్లాడుతూ పలు జోన్లలో పి జి ఆర్ ఎస్ ఫిర్యాదులు పరిష్కారం ఆలస్యంపై వివరణ కోరుతూ వాటిని త్వరితగతిన పరిష్కరించాలని, అలాగే వస్తున్న ఫిర్యాదులే మరలా నమోదు కావడంపై ప్రత్యేక దృష్టి సారించి అటువంటి వాటి పై ఫిర్యాదుదారులతో సంప్రదించి వాటి నియంత్రణకు చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.నల్లనయ్య, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి నరేష్ కుమార్, సిసిపి ఏ.ప్రభాకర రావు, జాయింట్ డైరెక్టర్ విజయభారతి,ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ సి. వాసుదేవ రెడ్డి, డిసిఆర్ ఎస్.శ్రీనివాసరావు, కార్యదర్శి బి.వి.రమణ, ఎడిహెచ్ వాసుకి, స్పోర్ట్స్ డైరెక్టర్ ఇ.ఎ.రాజు, పర్యవేక్షక ఇంజనీర్లు, డిసీపీ లు, ఏసీపీ లు, యు సి డి ప్రాజెక్ట్ ఆఫీసర్ పి. ప్రసన్న వాణి, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ శాంతి కుమారి, బయాలజిస్ట్, తదితరులు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి,
జివిఎంసి
.jpeg)
Comments
Post a Comment