Skip to main content

10వ తరగతి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో విజయం సాధించాలి: సర్పంచ్ నక్కా అరుణకుమారి చంద్రశేఖర్

అమలాపురం, విశాఖ సందేసం...10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థినీ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు వ్రాసి అత్యధిక మార్కులతో విజయం సాధించాలని కామనగరువు గ్రామ సర్పంచ్ నక్కా అరుణకుమారి చంద్రశేఖర్ ఉద్బోధించారు. అమలాపురం రూరల్ మండలం కామనగరువు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల టెన్త్ విద్యార్థులకు పరీక్షల మెటీరియల్ ను  సర్పంచ్ అరుణ కుమారి చంద్రశేఖర్ అందజేశారు. సర్పంచ్ ఆర్థిక  సౌజన్యంతో  విద్యార్థినీ విద్యార్థులకు పరీక్షల ప్యాడ్స్, పెన్నులు, స్కేల్స్, రబ్బర్లు, పెన్సిల్స్ తో పాటు పలు వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్  మాట్లాడుతూ పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని, పరీక్షలు అంటే భయం, ఒత్తిడికి గురికాకూడదన్నారు. స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఆనందంగా పరీక్షలు రాయాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ ఆశీస్సులు అందించారు. పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రధమంగా నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించడం జరుగుతుందని సర్పంచ్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి ఆర్ఎస్ఎస్ సూరపరాజు, జేఏబీసీ ఆదినారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...