జివిఎంసి టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కు 12 వినతులు. *ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్ మంజూరు ప్రక్రియ వేగవంత చేయండి. *అడ్వర్టైజ్మెంట్ టాక్స్ ల వసూళ్ళపై దృష్టి సారించండి. -జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.
విశాఖపట్నం మార్చి– 06: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమంలో 12 వినతులు స్వీకరించడమైనదని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. శుక్రవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమావేశం మందిరం లో చీఫ్ సిటీ ప్లానరు ఎ.ప్రభాకారరావు, సిపి లు, డీసీపీలు, ఏసీపీ లతో కలిసి ప్రత్యేకంగా టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమాన్ని నిర్వహించారుఈ సందర్భంగా కమిషనరు మాట్లాడుతూ జీవీఎంసీ లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న PGRS కార్యక్రమం లో జివిఎంసి పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి ప్రజల నుండి అధికంగా ఫిర్యాదులు నమోదవుతున్నందున, జివిఎంసి పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి ప్రజల నుండి ఫిర్యాదులు/ వినతులను స్వీకరించేఁదుకు గానూ ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమానికి సంబంధించి 12 వినతులు స్వీకరించడం జరిగినదని, అందులో ముఖ్యంగా మధురవాడ జోన్ కు 02, ఈస్ట్ జోన్ కు 04, నార్త్ జోన్ కు 01, వెస్ట్ జోన్ కు 01, పెందుర్తి జోన్ కు 03, గాజువాక జోన్ కు 01 వినతులు వచ్చాయని తెలిపారు. స్వీకరించిన వినతులను /ఫిర్యాదులను నిర్ణీత సమయంలో టౌన్ ప్లానింగు అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించడమైనదన్నారు.అనంతరం కమిషనరు మాట్లాడుతూ జివిఎంసి పరిధిలో ఎలాంటి అనధికార నిర్మాణాలు జరుగుచున్నా ,, నిబంధనలను ఉల్లంఘించి భవనాలు నిర్మించినా, భవన నిర్మాణ వ్యర్ధాలపై, టౌన్ ప్లానింగు విభాగం పై, ఎలాంటి ఫిర్యాదులపై ప్రజలు పెట్టుకున్న అర్జీలను/ఫిర్యాదులను నిర్ణీత సమయం లో విభాగాధిపతులు పరిష్కరించాలని, స్వీకరించిన అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి కార్యాచరణ చేపట్టాలని, ప్రతివారం అదే ఫిర్యాదులు ప్రజలు సమర్పించకుండా ఆయా సమస్యలను నిర్ణీత సమయం లో పరిష్కరించాలని, వచ్చిన ఫిర్యాదులను దిగువ స్థాయి సిబ్బంది నుండి పై అధికారి వరకు వివరణ అడిగి తెలుసుకొని వచ్చిన ఆర్జీని తక్షణమే పరిష్కారమయ్యే విధంగా చూడాలని టౌన్ ప్లానింగ్ అధికారులను, సిబ్బందిని కమిషనరు ఆదేశించారఅలాగే అడ్వర్టైజ్మెంట్ టాక్స్ డిమాండు, వసూళ్ళుపై, ఎల్ఆర్ఎస్, బి పి ఎస్ ధరఖాస్తుల మంజూరు ప్రక్రియ పై ఆరాతీసి అడ్వర్టైజ్మెంట్ టాక్స్ ఇప్పటివరకు ఎంత వసూలు అయిందని, కొత్తగా పన్ను వేయవలసినవి ఎన్ని గుర్తించారని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను అడిగి తెలుసుకున్నారు. దుకాణాలతో పాటు ఇతర అడ్వర్టైజ్మెంట్ యొక్క డిమాండ్లను తయారుచేసి నిర్ణీత కాలం లో అడ్వర్టైజ్మెంట్ పన్నులు వసూలు చేయాలని, అలాగే అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీల యొక్క హోర్డింగ్ ల అడ్వర్టైజ్మెంట్ టాక్స్ లను నిర్ణీత కాలం లో వసూళ్ళు చేయాలని చీఫ్ సిటీ ప్లానర్ ను ఆదేశించారు. ఎల్.ఆర్.ఎస్, బిపిఎస్ ధరఖాస్తుల మంజూరుకై సంబంధిత ఆస్తులను స్వయంగా పరిశీలించి మంజూరు ప్రక్రియను వేగవంత చేయాలని టౌన్ ప్లానింగు అధికారులను ఆదేశించారు.
పట్టణ ప్రణాళికా విభాగమునకు సంబంధించి ఫిర్యాదులు, అర్జీలు మొదలైనవి ప్రతి శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కార్యక్రమంలో ప్రజలు నమోదు చేసుకోవచ్చునని కమిషనరు తెలిపారు.
పౌర సంబంధాల అధికారి,జివిఎంసి
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
Comments
Post a Comment