అమరజీవికి ఘన నివాళులు* *పొట్టి శ్రీరాములు సేవలు* *అజరామరం* *ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పరితపించిన వ్యక్తి* *125 వ జయంతి సందర్భంగా* *ఘనంగా నివాళులర్పించిన గంట్ల*
విశాఖపట్నం మార్చ్ 16 తన ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసం.. ప్రత్యేక రాష్ట్రం కోసం పాటుపడిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని తెలుగు వారి గుండెల్లో ఆయన చిరస్మరణీయులుగా నిలిచిపోయారని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు అన్నారు.. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా సోమవారం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో గంట్ల శ్రీనుబాబు పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ.. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని కోరుకోవడం తోపాటు అది సాధించే వరకు శ్రీరాములు తన నిరంతర ప్రయత్నం కొనసాగించి మహోన్నత వ్యక్తిగా నిలిచిపోయారని అభివర్ణించారు..
అటువంటి మహోన్నతమైన ఆశయాలు కలిగిన పొట్టి శ్రీరాములు విగ్రహం అమరావతిలో ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు

Comments
Post a Comment