Skip to main content

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125 వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్.,గారు.* *ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన మహానీయుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు, ఆ మహనీయుని జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకొని పట్టు విడవకుండా లక్ష్యాలను సాధించాలి- పోలీసు కమిషనర్

ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ 1901 మార్చి 16న ప్రస్తుత చెన్నై నగరంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జన్మించారన్నారు. చిన్నప్పటి నుంచే ఆయనలో సేవాభావం, దేశభక్తి, నిబద్ధత వంటి గొప్ప లక్షణాలు ఉన్నాయన్నారు. దేశ సేవ కోసం తన సుఖవంతమైన జీవితాన్ని వదిలిపెట్టారన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా మారి, మహాత్మా గాంధీ గారి ఆలోచనలతో ప్రభావితమై అహింసా మార్గంలో పోరాటం చేశారన్నారు. అప్పటిలో మద్రాస్ రాష్ట్రంలో ఉన్న తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలన్న డిమాండ్‌తో 1952 అక్టోబర్ 19న మద్రాసులో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారన్నారు. 58 రోజుల పాటు పట్టు వీడకుండా తన నిరాహార దీక్షను కొనసాగించి రాష్ట్ర సాధన కొరకు అమరుడైనారని గుర్తు చేశారు. అనంతరం భాష ప్రాతిపదికన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆయన త్యాగం ఎప్పటికీ తెలుగు ప్రజలు మరవరాదన్నారు. యువత ఆ మహనీయుని జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని తమ లక్ష్యాలను సాధించేందుకు అహర్నిశలు కృషి చేయాలన్నారు. 

           Dr Nanduri Ramakrishna 

                     Sr Sub EDITOR 



          

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...