*నేటి నుంచి అనంత వేంకటేశ్వర స్వామి* *దేవాలయం ద్వితీయ వార్షికోత్సవాలు* *రామానుజుల.. అన్నమాచార్య* *12 ఆల్వార్ల విగ్రహాలు ఏర్పాటు*
పి వి ఆర్ సురేష్ లు తెలియజేశారు.గురువారం హోటల్ మేఘాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడుతూ విజయనగరం
జిల్లా గంట్యాడ మండలం, ఎగువ కొండపర్తి ప్రాంతంలో సముద్ర మట్టానికి 3333 అడుగులు ఎత్తున అనంతగిరి వైకుంఠ శిఖరంపై నిర్మించిన
శ్రీ అనంత వేంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణ వ్యవస్థాపక ధర్మకర్తలుగా కర్రి సముద్రారెడ్డి (సాగర్), శ్రీవిద్య దంపతులు వ్యవహరిస్తున్నారని తెలిపారు.
ఆగమ శిల్ప శాస్త్ర నిపుణులు చామర్తి బాలభాస్కరన్ స్థపతి 2022 ఏప్రిల్ 7న చామర్తి శ్రీధరాచార్య స్వామి ఆధ్వర్యంలో నిర్మాణ శంకుస్థాపన జరిగిందన్నారు.కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని దర్శన అనుభూతిని ఇచ్చేలా, తాటిపూడి జలాశయం పక్కన అనంతగిరి శిఖరంపై నిర్మాణమవుతున్న పుణ్యక్షేత్రం విశాఖ,అరకు మార్గంలో కాశీపట్నం నుంచి 36 మలుపులు, 18 కి.మీ ఘాట్ రోడ్ తిరుమల మార్గాన్ని గుర్తు చేసే విధంగా ఉంటుందన్నారు. దేవాలయానికి వచ్చే భక్తుల కోసం
సదుపాయాలు కల్పించడానికి అర్చక నిలయం, ధర్మసత్రం, భోజనశాల, కేశఖండనశాల, ప్రసాదశాల, గోశాల, కళ్యాణమండపం, వీఐపీ కాటేజ్, గార్డెన్, పార్కింగ్ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. దేవాలయ రెండవ వార్షికోత్సవాలు
ఈ గురువారం నుంచి ఈనెల 14 శనివారం వరకు జరుగుతాయన్నారు.
ఈ కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నత అధికారులు హాజరవుతారన్నారు.
ఈనెల 14న ఉదయం 9:06 గంటలకు ఉత్తరాషాఢ నక్షత్రయుత మేష లగ్నంలో ప్రధాన రాజగోపుర ప్రతిష్ట, పన్నిద్రాళ్వార్ రామానుజ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందన్నారు.
గురువారం ఉదయం దేవాలయంలో వెంకటేశ్వర స్వామికి విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, యాగశాల ప్రవేశం, అఖండ దీపస్థాపన, హోమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. సాయంత్రం 5:45 కు అంకురార్పణ, జలాధివాసం, పవళింపుసేవ దైవిక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.13 శుక్రవారం ఉదయం 6 కు 108 లీటర్ల పాలతో విశేష క్షీరాభిషేకం, వాస్తు పూజ, ధాన్యాధివాసం నిర్వహించడం జరుగుతుందన్నారు. సాయంత్రం 5:45 మండలారాధనలు, బలిహరణం పూజలు నిర్వహిస్తామన్నారు.
14న ఉదయం 6 గంటలకు గర్తన్యాసం, శాంతిహోమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం 9 గంటల ఆరు నిమిషాలకు రాజగోపుర కలశ యంత్ర ప్రతిష్ట, విగ్రహావిష్కరణ, పూర్ణాహుతి, చక్రస్నానం, ద్వారప్రవేశం. సాయంత్రం ఐదు గంటలకు వెంకటేశ్వర స్వామి శాంతి కళ్యాణం, ప్రముఖులకు సత్కారములు నిర్వహిస్తామన్నారు.
వేదిక నాయకత్వంలో చామర్తి సత్య శ్రీధరాచార్య, శ్రీ దామర్తి శ్రీనివాసాచార్య ఆచార్యత్వం సారథ్యంలో 16 మంది వైష్ణవ వేదపండితులు పాంచరాత్రాగమ శాస్త్రప్రకారం త్రయాహ్నిక దీక్షతో పూజలు నిర్వహిస్తారని తెలిపారు.. ఆలయ కమిటీ సభ్యులు ధవలేశు కుమార్.. ప్రముఖ ఆర్టిస్ట్ వ్యాకరణం భరద్వాజ్. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు సమన్వయకర్తగా వ్యవహరించారు
వెబ్‌సైట్: www.vykuntagiri.org , +91 7981748268 ఫోన్ నెంబర్కు సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులువెంకటరమణ సురేష్,వెంకట్ రాజుభరద్వాజ్, ధవలేష్ కుమార్పా ల్గొన్నారు

Comments
Post a Comment