కిమ్స్ వైద్య కళాశాలలో ఆత్మహత్య నివారణ గేట్‌కీపర్ శిక్షణా కార్యక్రమం - మానసిక క్షోభకు గురైన వారికి హెల్ప్ లైన్ నెంబర్ 14416 - డా.సలాం
అమలాపురం, విశాఖ సందేసం అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో ప్రధమ సంవత్సరం విద్యార్థులకు డా.ఎం.ట్.ఆర్.యూనివర్సిటీ ప్రతినిధులు, భావోద్వేగ అంచనా మరియు తక్షణ చర్యలపై, ఆత్మహత్య నివారణ గేట్‌కీపర్ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కిమ్స్ డీన్ డా.ఆనంద్ ఆచార్య శుక్రవారం తెలిపారు. భారతదేశంలో ఈ ఆత్మహత్యలు ప్రతి సంవత్సరం 4 శాతం పెరుగుతూ, 2022లో 1.71 లక్షల మంది, 2019లో 10,335 మంది, 2020లో 12,526 మంది, 2021లో 13,000 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు కిమ్స్ వైస్ ప్రిన్సిపాల్ డా.రేణు సులఖే తెలిపారు దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో 120కి పైగా వైద్య విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారిలో చాలామంది హెచ్చరిక సంకేతాలను ప్రదర్శించారు. అని, కొందరు మరణానికి ముందు మానసిక వైద్య సహాయం కోరుతున్నారని కిమ్స్ మానసిక వైద్య విభాగాధిపతి డా. అబ్దుల్ సలాం తెలిపారు.
పరీక్షలలో ఒత్తిడి నిర్వహణ, మానసిక క్షోభకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలను గుర్తించడం మరియు సహాయం కోరడం, భావోద్వేగ ప్రథమ చికిత్స అందించడం మరియు సానుకూల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ద్వారా, అటువంటి లక్షణాలను ముందుగా గుర్తించి తగిన సహాయాన్ని అందించడం, తద్వారా అనేక మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడగలమని డా.సలాం తెలిపారు. ఇటువంటి మానసిక క్షోభకు గురైన వారికి సహాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్ 14416 ఏర్పాటు చేయబదినదని దీనిపై విద్యార్థులందరికీ డా సలాం అవగాహన కల్పించారు. డా. ఎన్.టి.ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఆంధ్రప్రదేశ్ మరియు QPRI ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ల మధ్య 5 సంవత్సరాల అవగాహన ఒప్పందంలో భాగంగా.మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులకు మానసిక మరియు ఆత్మహత్యల బాధను ఎదుర్కొంటున్న విద్యార్థుల కోసం ముందస్తు గుర్తింపులో శిక్షణ ఇవ్వడం తద్వారా ఆత్మహత్యలను నివారించడం ఈ కార్యక్రమ లక్ష్యం అని ఈ శిక్షణ కార్యక్రమ సమన్వయ కర్త డా.రేఖా కుమారి తెలిపారు. ఇప్పటివరకు, 2023 నుండి APలో 10,000 మంది మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులు ఈ ఆత్మహత్య నివారణ గేట్‌కీపర్ శిక్షణను పొందారని డా.రేఖా కుమారి తెలిపారు. యూనివర్సిటీ నుండి డా.తేజోవతి, డా. గిరీష ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 200 మంది కిమ్స్ ఎం.బి.బి.ఎస్. ప్రధమ సంవత్సరం విద్యార్థులు మరియు వైద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పరీక్షలలో ఒత్తిడి నిర్వహణ, మానసిక క్షోభకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలను గుర్తించడం మరియు సహాయం కోరడం, భావోద్వేగ ప్రథమ చికిత్స అందించడం మరియు సానుకూల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ద్వారా, అటువంటి లక్షణాలను ముందుగా గుర్తించి తగిన సహాయాన్ని అందించడం, తద్వారా అనేక మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడగలమని డా.సలాం తెలిపారు. ఇటువంటి మానసిక క్షోభకు గురైన వారికి సహాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్ 14416 ఏర్పాటు చేయబదినదని దీనిపై విద్యార్థులందరికీ డా సలాం అవగాహన కల్పించారు. డా. ఎన్.టి.ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఆంధ్రప్రదేశ్ మరియు QPRI ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ల మధ్య 5 సంవత్సరాల అవగాహన ఒప్పందంలో భాగంగా.మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులకు మానసిక మరియు ఆత్మహత్యల బాధను ఎదుర్కొంటున్న విద్యార్థుల కోసం ముందస్తు గుర్తింపులో శిక్షణ ఇవ్వడం తద్వారా ఆత్మహత్యలను నివారించడం ఈ కార్యక్రమ లక్ష్యం అని ఈ శిక్షణ కార్యక్రమ సమన్వయ కర్త డా.రేఖా కుమారి తెలిపారు. ఇప్పటివరకు, 2023 నుండి APలో 10,000 మంది మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులు ఈ ఆత్మహత్య నివారణ గేట్‌కీపర్ శిక్షణను పొందారని డా.రేఖా కుమారి తెలిపారు. యూనివర్సిటీ నుండి డా.తేజోవతి, డా. గిరీష ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 200 మంది కిమ్స్ ఎం.బి.బి.ఎస్. ప్రధమ సంవత్సరం విద్యార్థులు మరియు వైద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఇటువంటి ఉపయోగకరమైన కార్యక్రమాల నిర్వాహకులను కిమ్స్ చైర్మన్ కె.వి.వి.సత్యనారాయాయన రాజు మరియు ఎం.డి.సర్ రవి కిరణ్ వర్మ అభినందించారు

Comments
Post a Comment