15న వర్కింగ్ జర్నలిస్టుల ఉగాది సంబరాలు* *పంచాంగ శ్రవణం, కవిసమ్మేళనం* *ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు* ,*విందుభోజనం.. మహిళలకు చీరలు పంపిణీ*
అక్కయ్యపాలెం జంక్షన్, మార్చి 10ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపి బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ , ఏపి స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో ఈనెల 15న (ఆదివారం)వర్కింగ్ జర్నలిస్టుల ఉగాది సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు పి.నారాయణ, ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసరావులు తెలిపారు. ఉగాది పర్వదినం నేపధ్యంలో మంగళవారం అక్కయపాలెం ప్రాంతంలోని ఒక ప్రయివేటు హోటల్ లో ప్రత్యేక కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఈనెల 15న ఉదయం 9 గంటల నుంచి పూర్ణామార్కెట్ సమీపంలో ఉన్న క్రాంతి ధియేటర్ లో ఉగాది సంబరాలు ప్రారంభమవుతాయన్నారు. అల్పాహారం నుంచి మధ్యాహ్నం విందు భోజనం వరకు ఆయా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కవిసమ్మేళనం, పంచాంగశ్రవణం, పంచాంగాల పంపిణీతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మహిళలకు ప్రత్యేకంగా చీరలు పంపిణీ చేస్తామన్నారు. ప్రతీ ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా పంచాంగ శ్రవణం నిర్వహించిన పండితులతో పాటు అతిధులను ఘనంగా సత్కరించనున్నట్లు వీరు వివరించారు. కావున వర్కింగ్ జర్నలిస్టులంతా ఈ ఉగాది సంబరాల్లో పాల్గొని జయప్రదం చేయాలని వీరు కోరారు.ఈ సమావేశంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ లు డి .రవికుమార్, పితాని ప్రసాద్, ఉపాధ్యక్షులు బండారు శివప్రసాద్,రామకృష్ణ జాయింట్ సెక్రెటరీ రాంబాబు,నగేష్ బ్రాడ్ కాస్ట్ అధ్యక్షుడు ఇరొతి ఈశ్వరరావు కార్యదర్శి మాధవ్, స్మాల్ పేపర్స్ అసోసియేషన్ జగన్మోహన్,కార్యదర్శి బొబ్బర ప్రసాద్, కార్యవర్గ సభ్యులు కె వి శర్మ, మధురవాడ ఆనంద్, రాజశేఖర్, కిషోర్, హరి,


Comments
Post a Comment