Skip to main content

ప్రజా అర్జీలపై ప్రత్యేకంగా ద్రుష్టి సారించాలి : జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ప్రజా నమస్యల పరిష్కార వేదిక 180 అర్జీలు

అమలాపురం, విశాఖ సందేసం...ప్రజా నమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలని. అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్దిష్ట గడువులోగా నమస్యకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ మరియు డ్వామా పథక సంచాలకులు ఎస్ మధుసూదన్, సమగ్ర శిక్ష ఏపీసి జి మమ్మీ డి ఆర్ డి ఏ పి డి, డి శ్రీనివాసరావు కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 180 అర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూ, పురపాలక, పట్టణాభివృద్దికి పోలీస్, వంచాయతీరాజ్ మార్కెటింగ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విద్యుత్, పౌర సరఫరాలు, విభిన్న ప్రతిభావంతులు, వైద్య ఆరోగ్యశాఖ, ఇరిగేషన్ ఎక్సైజ్, విద్య, గృహ నిర్మాణం, మైన్స్, నైపు ణ్య అభివృద్ధి, ఎండోమెంట్ కి వశు సంవర్ధక, ఆయుష్, బ్యాంకింగ్ సేవలు, డీఆర్డీఏ, ఐసీడీఎస్, కార్మిక శాఖకు చెందిన అర్జీలు అందాయి . ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్   మాట్లాడుతూ ప్రజా నమస్యల పరిష్కారానికి సంబంధించి పీజీఆర్ ఎస్ ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న విశ్వసనీయ వేదికని, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.  అర్జీల పరిష్కారంలో జాప్యం చేయకుండా క్షేత్ర స్థాయిలో వరిశీలనలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని అధికారులకు ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో పారదర్శకత, బాధ్యతాయుత విధానం పాటించాలని స్పష్టం చేశారు.అర్జీదారులు సంతృప్తిని చెందే విధంగా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.  ప్రజలు దగ్గర నుండి అర్జీలను స్వీకరించి, నిర్ణీత సమయంలోగా సమస్యలను పరిష్కారం చేస్తామని వారికి భరోసా నిచ్చి, వేసవి దృష్ట్యా త్వరితగతిన ప్రజలను తిరిగి ఇంటికి పంపించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పిజిఆర్ ఎస్, రెవిన్యూ క్లినిక్లలో అందిన అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, అర్జీలు నాణ్యతతో అర్జీదారులు సంతృప్తిని చెందే విధంగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని, అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయిలో వెళ్ళిపరిశీలించి పరిష్కారం చూపాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలని, ఎటువంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరేట్ ఏవో కాశీ విశ్వేశ్వరరావు జిల్లా కలెక్టరేట్ సూపర్డెంట్లు, తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...