విశాఖపట్నం పోర్ట్ అథారిటీ*సాధారణ పరిపాలన విభాగం* 18.03.2026* *విశాఖపట్నం పోర్ట్ ను సందర్శించిన నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ఫ్యాకల్టీ, కోర్స్ సభ్యులు* …
16 మంది సభ్యులతో కూడిన నేషనల్ డిఫెన్స్ కాలేజ్ (NDC) ఫ్యాకల్టీ మరియూ కోర్స్ సభ్యుల బృందం విశాఖపట్నం బుధవారం విశాఖపట్నం పోర్ట్ అథారిటీని సందర్శించారు. పోర్ట్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి రోష్ని అపరంజి కొరాటి, IAS, ఎన్‌డీసీ బృందానికి సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పోర్ట్ లో న్న మౌలిక సదుపాయాలు, కార్గో నిర్వహణ సామర్థ్యాలు, ఆధునీకరణ మరియు యంత్రీకరణ, కవర్ స్టోరేజ్ సదుపాయాలు, సౌర శక్తి వినియోగం, అంతర్గత మరియు పారిశ్రామిక అవసరాల కోసం మలిన జల శుద్ధి కేంద్రం, విశాఖ అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ అభివృద్ధి వంటి అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డిప్యూటీ చైర్ పర్సన్…బృందానికి వివరించారు.
ఈ సందర్భంగా విశాఖపట్నం పోర్ట్ ఇచ్చిన ఆతిథ్యం పట్ల ఎన్డీసీ బృందం పోర్ట్ డిప్యూటీ చైర్ పర్సన్ మరియు సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోర్ట్ కార్యదర్శి శ్రీ ఎం. శంకర బాబు, విభాగాధిపతులు మరియు సీనియర్ అధికారులు పాల్గొన్నారు

Comments
Post a Comment