సత్యసాయి సేవా సంస్థలు విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్. 19.03.2026 అత్యంత వైభవంగా శ్రీ సత్యసాయి ప్రేమసదన్ మందిరం (శ్రీ సత్యసాయి విద్యా విహార్ ప్రాంగణం) లో జరిగిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది" పర్వదిన మహోత్సవములు - ప్రత్యేక పరిమళాన్ని నింపిన “శ్రీ సత్యసాయి త్రిభువన విజయం కవి సమ్మేళనం

పరిపూర్ణ ప్రేమావతారులు, సర్వదేవతా అతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి ప్రేమసదన్ మందిరం (శ్రీ సత్యసాయి విద్యా విహార్ ప్రాంగణం) లో , సెక్టార్-8, ఎం.వి.పి. కోలనీ లో ఈ రోజు "శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది" పర్వదిన మహోత్సవములు అత్యంత వైభవంగా సాంప్రదాయ సిద్ధంగా నిర్వహించబడ్డాయి.
ఉదయం వేదం, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అష్టోత్తరము మరియు స్వామి వారికి ఉగాది పచ్చడి నైవేద్యం నివేదన అనంతరం శ్రీరామ నవమి సందర్బంగా శ్రీ సీతారామ కల్యాణనికి నాందిగా పందిరి రాట వేయు కార్యక్రమం నిర్వహించబడింది.
ముందుగా జ్యోతి ప్రజ్వలన, శ్రీ గణపతి ప్రార్ధన అనంతరం, శ్రీ పిన్నింటి రామసుందర నారాయణ నాయుడు (పి.ఆర్. ఎస్. ఎస్. నాయుడు) జిల్లా అధ్యక్షులు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, విశాఖపట్నం జిల్లా, స్వాగతం, తోలి పలుకులు పలికారు. ఎంతో పేరొందిన పెద్దలు కవి సమ్మేళనం కు విచ్చేసినందుకు ధన్యవాదములు తెలియ చేశారు.“శ్రీ సత్యసాయి త్రిభువన విజయం - కవి సమ్మేళనం లో ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారు, విశ్రాంత తెలుగు ఆచార్యులు వారి ఆధ్వర్యం లో అద్భుతంగా జరిగింది. ముందుగా ఆచార్య శ్రీమతి కోలవెన్ను మలయవాసిని గారు మాట్లాడుతూ త్రిభువన విజయం మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడటమే ప్రధాన ఆశయంగా భావించి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు ప్రతి సంవత్సరమూ
త్రిభువన విజయమనే సాంస్కృతిక , సాహిత్య కాయక్రమాలను నిర్వహించి ప్రజలలో చైతన్యాన్ని , సంస్కారాన్ని కలిగించేవారు. అందరినీ ప్రేమించు- అందరినీ సేవించు అన్న భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి ఉత్తమ సంస్కారమైన బోధనను పాటిస్తే సమాజం శాంతియుతంగా , ఆనందమయంగా ఉంటుందని ఆచార్య శ్రీమతి కోలవెన్ను మలయవాసిని గారు అన్నారు. ఈ సందర్భంగా శ్రీ సత్య సాయి త్రిభువన విజయం కవి సమ్మేళన రచనల సంకలనం విషిత అతిధులు రిలీజ్ చేశారు
ఆచార్యవి. బాలమోహన్ దాస్, మాజీ వైస్ ఛాన్సలర్, నాగార్జున విశ్వవిద్యాలయం, శ్రీ ఎం ఎస్ ప్రకాశం రావు, ఆచార్య కోలవెన్ను విట్టల్ మూర్తి గారు, విశ్రాంత ఆచార్యులు, ప్రవచనకర్త
డాక్టర్ మీగడ రామలింగస్వామి, ప్రముఖపౌరాణిక రంగస్థల కళాకారులు, దర్శకులు,డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ, కళాభారతి, విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ,డాక్టర్ రాంభట్ల నృసింహ శర్మ, రచయిత,వ్యాఖ్యాత,ఆల్ ఇండియా రేడియో, విశాఖపట్నం,డాక్టర్ దామెర వెంకటసూర్యారావు, రచయిత
డాక్టర్ ఉపద్రష్ట సర్వమంగళ శాస్త్రి, తెలుగుఆచార్యులు,గాయత్రీ విద్యా పరిషత్
డాక్టర్ కందాళ కనకమహాలక్ష్మి, తెలుగు అధ్యాపకులు, విశాఖ సాహితి సంస్థ
డాక్టర్ వెంపటి రామనరసింహం, ఫిజీషియన్, రచయిత
డాక్టర్ దుగ్గిరాల రాజ్ కిషోర్ ,
ఆచార్యులు(కంప్యూటర్స్)బుల్లయ కాలేజీ, రచయిత,డా. గండికోటరఘురామా రావు, స్కిన్ స్పెషలిస్ట్, విశాఖ రసజ్ఞ వేదిక వ్యవస్థాపకులు, శ్రీ ఎస్. వినయ భూషణ రావు, విశ్రాంత ఆచార్యులు ఇంగ్లిష్ డిపార్టుమెంటు, రచయిత డాక్టర్ వాడ్రేవు సూర్యప్రభ, స్త్రీవైద్యులు, మరియు రచయిత్రి
శ్రీమతిమండా రామలక్ష్మ్మి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సహబోది ప్రముఖ్, రచయిత్రి, శ్రీమతి దామరాజు విశాలాక్షి, విశ్రాంత తెలుగు అధ్యాపకురాలు, డాక్టర్ కొచ్చెర్లకోట వెంకట సత్యన్నారాయణ మూర్తి, విశ్రాంతతెలుగు ఆచార్యులు
శ్రీ శేఖరమంత్రి ప్రభాకర్, రచయిత, సహృదయ సాహితి అధ్యక్షులు
శ్రీమతిమొసలికంటి మల్లిక, రచయిత, “ఘన విశాఖ”
శ్రీచిల్లా చిన సూర్యనారాయణ, పద్య కవి
శ్రీమతిఉండవల్లి సుజాత మూర్తి, రచయిత్రి, వ్యాఖ్యాత్రి
డాక్టర్చెళ్ళపిళ్ల సూర్య లక్ష్మి, IRAS.వంటి ప్రముఖ రచయితలు, కవులు, సాహితీ వేత్తలు పాల్గొన్నారు.
ఈనాటి కవి సమ్మేళనం లో *శ్రీ సత్య సాయి అవతార వైభవం, శ్రీ సత్య సాయి విశ్వవ్యాప్తి, వసంత నవ రాత్రులు-శ్రీరామ జననం, భక్తి-ఆధ్యాత్మిక సాధన, సమాజ సేవ- మానవ విలువలు, ప్రక్రుతి-పర్యావరణ పరిరక్షణ అన్న అంశాలపై కవి సమ్మేళనం లో పాల్గొన్న కవులు, రచయితలు, నాటక కర్తలు, వైద్యులు, ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు, వివిధ రంగాలలో ఉన్నత ఉద్యోగులు ప్రసంగించారు.
అనంతరం కవులకు సత్కారం, వేద ఆశీర్వచనం అందించారు.
సాయంత్రం గం 5.00లకు వేదం, స్వామివారి అష్టోత్తరము. గం 6.00 నుండి గం 6.30 వరకు సమితి గాయకులచే నమసంకీర్తన, మరియు గం 6.30లకు శ్రీ మల్లంపల్లి కృష్ణ ప్రద్యుమ్న గారిచే పంచాంగ పఠనం అనంతరం స్వామివారి మంగళహారతి జరిగింది.
కార్యక్రమాన్ని విశాఖ జిల్లా శ్రీ సత్య సాయి సేవా సంస్థల జిల్లా జాయింట్ స్పిరిట్యుయల్ కోఆర్డినేటర్ శ్రీ బి వి రమణ సమన్వయపరిచారు
ఈ కార్యక్రమం లో శ్రీ పిన్నింటి రామసుందర నారాయణ నాయుడు (పి.ఆర్. ఎస్. ఎస్. నాయుడు) జిల్లా అధ్యక్షులు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు,
విశాఖపట్నం జిల్లా, శ్రీ B. సాయికుమార్, కన్వీనర్, సిటీ సమితి, శ్రీ సత్య సాయి సేవా సంస్థల రాష్ట్ర, జిల్లా పదాధికారులు శ్రీ సత్య సాయి మహిళా సభ్యులు, బాలవికాస్ సభ్యులు, శ్రీ సత్య సాయి యువత, పురజనులు భక్తితో, ఆనందంతో పాల్గొన్నారు.
Comments
Post a Comment