Skip to main content

ముస్లిం జర్నలిస్టులకు రంజాన్ తోఫా* *పండగ కానుకగా 20,000 అందించిన గంట్ల* *ప్రత్యేక బహుమతులు పంపిణీ*

అక్కయ్యపాలెం మార్చ్ 11*రంజాన్ పర్వదినము* సందర్భంగా నగరంలోని ముస్లిం జర్నలిస్టుల అసోసియేషన్ సభ్యులకు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ..ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్

 జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు

గంట్ల శ్రీనుబాబు రంజాన్ తోఫా అందజేశారు.. ఈ మేరకు బుధవారం అక్కయ్యపాలెంలోని 

తన కార్యాలయంలో జర్నలిస్టులకు రంజాన్ పండుగ కానుకగా 20,000 నగదు అందజేశారు.. అలాగే వీరికి ప్రత్యేక బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ 

ప్రతి ఏటా రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం జర్నలిస్టులకు గత 15 ఏళ్లుగా తన పరిధి మేరకు తోఫా అందజేస్తున్నట్లు చెప్పారు.. అలాగే ఈ ఏడాది ప్రత్యేక  బహుమతులు కూడా అందజేశామన్నారు.. రంజాన్ పర్వదినం వేళ లోకమంతా సుభిక్షంగా ఉండాలని

తాను కోరుకున్నట్లు చెప్పారు.. జర్నలిస్టులకు నిరంతరం అండగా ఉంటానని తన పరిధి మేరకు వారికి ఎప్పటికప్పుడు సహాయం అందిస్తూనే ఉంటానన్నారు.. నిరుపేద విద్యార్థులకు ప్రతి ఏటా విద్యా ప్రోత్సాహకాలు అలాగే వైద్యానికి సంబంధించి ఎంతో కొంత ఆర్థిక సహాయం తాను అందిస్తున్నట్లు చెప్పారు.. ఈ కార్యక్రమంలోముస్లిం జర్నలిస్టుల సంఘం ప్రతినిధులు 

మౌలానా.. గయాజ్.. ఇస్మాయిల్..

సాదిక్.. అహ్మద్ తదితరులంతా పాల్గొన్నారు

                       Sharma K.V.Editor

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...