Skip to main content

ఘనంగా ముగిసిన జీవీఎంసీ కౌన్సిల్ వీడ్కోలు సభ* *2021-26 జీవీఎంసీ కౌన్సిల్ ఎప్పటికీ చరిత్రలో స్ఫూర్తిదాయకంగా మిగిలిపోతుందన్న దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్. *విశాఖ నగర అభివృద్ధి దిశగా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందని పేర్కొన్న మేయర్ పీలా శ్రీనివాసరావు. • కౌన్సిల్ కాలంలో 15000 కోట్లు అభివృద్ధి పనులను సాధించి జీవీఎంసీ చరిత్రలో ఒక స్థానాన్ని సంపాదించుకుందని వెల్లడించిన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్. • ప్రజలు అందించిన ఐదు సంవత్సరాల సదవకాశంతో విశాఖ నగర అభివృద్ధికి పని చేసే భాగ్యం కలిగిందని పేర్కొన్న ఫ్లోర్ లీడర్లు,కార్పొరేటర్లు.

విశాఖపట్నం, మార్చ్ 17:  2021-26 జీవీఎంసీ కౌన్సిల్ కు ఘన వీడ్కోలు సభా కార్యక్రమాన్ని ఋషికొండ సమీపంలో సాయి ప్రియా రిసార్ట్లో ముఖ్యఅతిథి దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్లు దల్లి గోవిందరాజు, కట్టమూరు సతీష్ , అన్ని పార్టీలకు ఫ్లోర్ లీడర్లు, కార్పొరేటర్లు తో కలిసి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్  మంగళవారం ఘనంగా నిర్వహించారు.  

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ 2021 - 26  జీవీఎంసీ కౌన్సిల్ చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోతుంది అన్నారు. విశాఖ నగర అభివృద్ధి దిశగా మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఫ్లోర్ లీడర్లు,వార్డు కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు ప్రజల సేవల దిశగా విశాఖ నగర అభివృద్ధికి నిత్యం కృషి చేస్తూ విశాఖ నగర కీర్తిని మరింత పెంచారన్నారు. ప్రపంచ దేశాలు నేడు విశాఖ నగరం వైపు చూస్తున్నాయని ఆ దిశగా జీవీఎంసీ కౌన్సిల్ పనితీరు ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోతుందన్నారు. ప్రజలకు సేవ చేసేలా నగర అభివృద్ధికి కృషి చేసినప్పుడు ఆ వ్యక్తికి గౌరవం మరింత పెరుగుతుందన్నారు.  ఎప్పుడు గౌరవంగా జీవించే పదవులను అందరూ చేపట్టాలని ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ నగర మేయరుగా పీలా శ్రీనివాసరావు  తక్కువకాలం పదవిలో ఉన్నప్పటికీ ఆ కాలంలో విశాఖ నగర అభివృద్ధికి ఎన్నో పనులను మంజూరు చేయడం ద్వారా చరిత్రలో మిగిలిపోతారు అన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని జీవీఎంసీ కమిషనర్ నిర్వహించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు ఎమ్మెల్యే కమిషనర్ కు తెలిపారు.అనంతరం నగర మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల ఓట్లతో జీవీఎంసీ కౌన్సిల్లో అడుగుపెట్టి విశాఖ నగర అభివృద్ధికి సేవలందించినందుకు చాలా తృప్తినిచ్చిందని, ఈరోజు కౌన్సిల్ పెడుతున్నందుకు బాధగా ఉన్న ప్రజాసేవకు అంకితమైనందుకు ఆనందంగా ఉందన్నారు. కార్పొరేటర్లు జీవీఎంసీ కమిషనర్, అధికారులు, ఉద్యోగులు ఒక కుటుంబంలో విధులు నిర్వహిస్తూ ఈ కౌన్సిల్ ను నడిపినందుకు ఆనందంగా ఉందన్నారు. యోగాంధ్ర, సిఐఐ సమ్మె టు,  ఐఎఫ్ ఆర్, విశాఖ ఉత్సవ్ తదితర అంతర్జాతీయ కార్యక్రమాలకు జీవీఎంసీ కార్యాచరణ అమోఘమని, ప్రపంచ చరిత్రలో విశాఖ ఎప్పటికీ నిలిచి ఉంటుంది అన్నారు. పది నెలల 20 రోజుల్లో జీవీఎంసీ అభివృద్ధికి నా వంతు కృషి చేశానన్నారు. కౌన్సిల్ నడపడంలో తప్పొప్పులను సరిదిద్దానని ,ముఖ్యంగా ఎంపీ ,ఎమ్మెల్యేల సహకారం మరింత సంతోషాన్ని ఇచ్చిందన్నారు. రాజకీయాలు, పదవులు శాశ్వతం కాదని విశాఖ అభివృద్ధిలో భాగస్వామ్యమయి ప్రధాని ,రాష్ట్రపతులకు స్వాగతం పలికే అవకాశం లభించడం నా అదృష్టం అన్నారు. విశాఖ నగరానికి అవార్డు లభించినప్పుడు అవి అందుకునే సమయంలో చాలా ఆనందం పొందానన్నారు. రాజకీయం కన్నా ఎప్పుడూ ఒక మాటకు కట్టుబడి ఉంటానని జీవీఎంసీ యంత్రాంగం నగర అభివృద్ధికి నిరంతరం ఇలాగే కృషి చేస్తూ విశాఖ కీర్తి ప్రతిష్టలను మరింత పెంచాలని ఆ దిశగా జీవీఎంసీ కమిషనర్ సహకరిస్తున్న తీరు అభినందనీయమన్నారు.

అనంతరం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ 15000 కోట్ల అభివృద్ధి పనులు ఈ కౌన్సిల్ సాధించిందని, జీవీఎంసీ చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు. విశాఖ నగర్ మేయర్ పీలా శ్రీనివాసరావు  అందించిన సహకారం మరువలేనిదని, కొంతమంది కౌన్సిల్ సభ్యులు సభలో మాట్లాడే పద్ధతి కొన్ని విషయాలను తెలుసుకునేలా చేసిందన్నారు. కౌన్సిల్లో గొడవలు, రగడ ఉన్న చాలా విషయాలు విశాఖ నగర అభివృద్ధి దిశకు  నేర్చుకోవచ్చునన్నారు . ఐఏఎస్ కన్నా కార్పొరేటర్లకు ఎక్కువ అనుభవం ఉంటుందని, జీవీఎంసీ కి ఏ సమయంలోనైనా వచ్చి ప్రజా సమస్యలను తెలియపరచాలన్నారు. ముఖ్యంగా కౌన్సిల్ జరిగే సమయంలో పలువురు కార్పొరేటర్లు మాట్లాడే విషయాలను చాలా గ్రహించానని, అందులో గాడు చిన్ని లక్ష్మి కుమారి ,మూర్తి యాదవ్ ,వసంత లక్ష్మి, బాణాల శ్రీనివాస్ ,డిప్యూటీ మేయర్ సతీష్ , గంకల కవిత, డిప్యూటీ మేయర్ గోవిందరాజు ,పల్లా శ్రీనివాసరావు ,పులి లక్ష్మి భాయ్,గంధం శ్రీనివాసరావు,లేళ్ళ కోటేశ్వరరావు ,బొండా జగన్నాథం, రాపర్తి కన్నా ,పిసిని వరాహ నరసింహ, బిపిన్ జైన్, స్టాలిన్, గంగారాం , నీలి బాబు, అనూష  ఇలా చాలామంది వారు మాట్లాడే తీరు, వార్డు అభివృద్ధి పట్ల వారికున్న చిత్తశుద్ధి స్వయంగా చూశానన్నారు. ఎప్పుడైనా ,ఎవరికైనా వార్డు పనుల మంజూరులో ఆలస్యం జరిగినా అందరూ పెద్ద మనసుతో మన్నించాలని కమిషనర్ తెలిపారు. జీవీఎంసీ కౌన్సిల్ కాలంలో కార్పొరేటర్లు ,మేయర్లు జీవీఎంసీ యంత్రాంగానికి అందించిన సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు కమిషనర్ తెలిపారు.అనంతరం డిప్యూటీ మేయర్లు కట్టమూరు సతీష్ ,దల్లి గోవిందరాజు, అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు మాట్లాడుతూ కౌన్సిల్ ప్రారంభంలోనే ప్రజలకు సేవ భాగ్యం కరోనా మంచి పని కల్పించిందని, ప్రజలు కార్పొరేటర్లను జీవీఎంసీ కి వారదులుగా పంపించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కౌన్సిల్ కాలంలో విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందిందని సహకరించిన కమిషనర్లు అధికారులకు ఉద్యోగులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 


అనంతరం జీవీఎంసీ అదనపు కమిషనర్లు డివి రమణమూర్తి, పీఎం సత్యవేణి, ఎస్ఎస్ వర్మ, పి నల్లనయ్య , కార్యదర్శి బివి రమణ మాట్లాడుతూ ఈ కౌన్సిల్ కాలంలో కార్పొరేటర్ల నుండి ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకోగలిగామని వాటిని పరిష్కరించే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉందని ఈ కౌన్సిల్ ఎప్పుడు చరిత్రలో అందరికీ గుర్తుండేలా మిగిలిపోతుందని పేర్కొన్నారు. 


అనంతరం నగర మేయర్ కు, డిప్యూటీ మేయర్ లకు, ఫ్లోర్ లీడర్లకు, కార్పొరేటర్లకు, గాజువాక శాసనసభ్యులు, జీవీఎంసీ కమిషనర్ , జిఎంసి అధికారులు సత్కరించి జ్ఞాపకం పంపించి అభినందనలు తెలిపారు. 


అనంతరం జీవీఎంసీ కమిషనర్ను గాజువాక శాసనసభ్యులు,మేయర్, డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు దుస్సాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యులు, జీవీఎంసీ అధికారులు, ఇంజనీర్లు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


పౌర సంబంధాల అధికారి,

 జీవీఎంసీ.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...