Skip to main content

స్వర్ణాంధ్ర@2047 లక్ష్యాల సాధనకు సమన్వయంతో పనిచేయాలి* *కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్ణయాల అమలుపై అధికారులతో కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్

విశాఖపట్నం, మార్చి 16 ః స్వర్ణాంధ్ర@2047 సాధనలో భాగంగా నిర్ణయించిన పది సూత్రాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి కార్యాచరణ చేపట్టాలని అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. రాష్ట్రాన్ని జీరో పావర్టీ దిశగా తీసుకెళ్లేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కుటుంబానికి బేసిక్ ఫ్యామిలీ ఎమెనిటీస్ అందేలా చూడడంతో పాటు కమ్యూనిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో రోడ్డు కనెక్టివిటీ పెంచడం, డ్రైనేజ్ నెట్‌వర్క్ మెరుగుపరచడం, స్ట్రీట్ లైట్లు సమర్థంగా వెలిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెత్త నుంచి సంపద తయారీ (వేస్ట్ టు వెల్త్) కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేయాలని చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల అమలుపై జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ సోమవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజా సేవల నాణ్యత పెంపు, ప్రభుత్వ ప్రధాన పథకాల అమలు, వాట్పాస్ గ‌వ‌ర్నెన్స్ పై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్గదర్శి- బంగారు కుటుంబం పథకం కింద ఫ్యామిలీ కార్డు ద్వారా కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల ప్రభుత్వ సేవలు అందేలా చూడాలని ఆదేశించారు. ఇందులో భాగంగా బంగారు మిత్రులు, సీఎస్సార్ దాతలు, ఆన్‌లైన్ క్రౌడ్ సోర్సింగ్, అడాప్ట్ కార్యక్రమాల ద్వారా నిధులు సమీకరించి ప్రజలకు మరింత సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ పథకాల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మరింత నాణ్యతతో అమలు చేయాలన్నారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని పెంచాలని సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు నైపుణ్య శిక్షణ శిబిరాలను విస్తృతంగా నిర్వహించాలని చెప్పారు.

*ఒన్ వైజాగ్ - ఒన్ యాప్, వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా సేవ‌ల‌ను విస్త‌రించాలి*పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు “ఒన్ వైజాగ్ - ఒన్ యాప్” ద్వారా సేవలను విస్తృతంగా అందించడంతో పాటు సిటిజన్ సర్వీసుల్లో నాణ్యత పెంచాలని సూచించారు. వాట్పాస్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవ‌ల‌ను విస్తృతం చేయాల‌న్నారు. గ్రీవెన్స్‌లను వేగంగా పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలని, తద్వారా ప్రభుత్వంపై పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడుతూ 32 రంగాల్లో ఒక లక్ష మందికి స్కిల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా, అందులో 5,043 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. ఇక నుంచి జిల్లా ఉపాధి కల్పనాధికారిని స్కిల్ అధికారిగా కూడా పరిగణించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా పాప్యులేషన్ మేనేజ్‌మెంట్ విధానానికి అనుగుణంగా జిల్లాలో చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఆరోగ్య ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా ఒక శనివారం ప్రజా వేదికల ద్వారా అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు.

స‌మావేశంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఇన్ఛార్జి డీఆర్వో శేష‌శైల‌జ‌, సీపీవో శ్రీ‌నివాస‌రావు, ఏడీసీ స‌త్య‌వేణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...