Skip to main content

22ఎ జాబితా నుండి భూములు తొలగించాలంటూ మాజీ సైనికుల వారసులు వినతిపత్రం.....

 అల్లవరం, విశాఖ సందేసం..డా॥బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లవరం మండలం, కొమరగిరిపట్నం గ్రామ మిలటరీ కాలనీకి చెందిన "ది కొమరగిరిపట్నం అగ్రికల్చ్ల్ ల్యాండ్ కోలనైజేషన్ కో-ఆపరేటివ్ సొసైటీ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్" నెం.బి.584రు సంఘ వారసులు మా సొసైటీ భూములను 22/ఎ జాబితా నుండి తొలగించలని జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ లో సోమవారం జిల్లా అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. మాజీ సైనికుల వారసులము. మా పితరులు మొత్తం 116 మంది మాజీ సైనికులకు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో మన భారత ప్రభుత్వం తరఫున పనిచేసినందుకు  అప్పటి బ్రిటీషు ప్రభుత్వం  1946వ సం.రం. లో అల్లవరం మండలం, కొమరగిరిపట్నం గ్రామంలో సుమారుగా 469 ఎకరముల భూమిని మాజీ సైనికుల కోటాలో పబ్లిక్ రీసెటిల్మెంట్ (PUBLIC RESETTLEMENT) ద్వారా మంజూరు చేసియున్నారు. ఈ భూములను సాగు చేయుచూ మా పితరులు గతించినారు. వారి తరువాత మేము ఈ భూములను పన్నులు కట్టుచూ సాగు చేసుకొనుచున్నాము. మాకు ప్రభుత్వం  ఇచ్చే రైతు భరోసా, రాయితీలు అందుటలేదు. మేము కడు పేద వారము. ఆర్థికముగా చితికిపోయియున్నాము. ఈ భూములు మాకు ఏ విధముగా ఉపయోగముగా లేవు. బ్యాంకు లోను గానీ, మార్పిడి చేసుకొనుటకు గానీ వీలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారుగా 60 మందికి 2001 సం.రం.లో ఇండివిడ్యుల్ పాస్బుక్కులు, డి. నమూనా పట్టాలు ఇచ్చియున్నారు. ప్రస్తుతం మా భూములు నిషిద్ధ ఆస్తుల జాబితా (22/ఎ)లో ఉన్నవి. ఈ విషయంలో అనేక సార్లు మా పెద్దలు ప్రయత్నించి విఫలం అయ్యారు. మేము కూడా ఈ సమస్యను అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినాము. కానీ మాకు న్యాయం జరగలేదు. ది.21-01-2026 సం.రం. తేదీన రెవెన్యూ డిపార్ట్మెంటు వారు జారీ చేసిన సర్క్యులā Memo NO. REV01-LANA0LAND/435/2025 ను అనుసరించి  22/A నిషిద్ద  భూముల జాబితా నుండి తొలగించి సబ్ డివిజన్ చేయించి మా వారసుల పేరున మ్యుటేషన్  చేయించవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు అంబటి గంగాధరరావు, అంబటి కోటేశ్వరరావు, గుమ్మళ్ళ స్వామీజీ, చీకురుమెల్లి కాళిదాసు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...