Skip to main content

జర్నలిజం ..సేవా రంగంలో గంట్ల కు రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం* *విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా స్వీకరణ* *తెలుగు తల్లి జ్ఞాపిక.. ..ప్రశంసా పత్రం.. నగదు . సత్కారం* *జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయిలో 23 పురస్కారాలు* *అవార్డులన్నీ జర్నలిస్టు* *మిత్రులకు అంకితం*

 

విజయవాడ.. మార్చి 19 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పర్వదినము సందర్భంగా విశాఖపట్నం కి చెందిన సీనియర్ పాత్రికేయులు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి 

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నాయకులు గంట్ల శ్రీను బాబుకు ప్రతిష్టాత్మకమైన ఉగాది పురస్కారాన్ని ప్రధానం చేయడం జరిగింది.. ఈ మేరకు గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన  ప్రభుత్వ ఉగాది వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇతర ప్రముఖుల చేతుల మీదుగా ఈ ఉగాది పురస్కారాన్ని గంట్ల శ్రీను బాబు స్వీకరించారు.. తెలుగు తల్లి జ్ఞాపిక.. పదివేల నగదు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రశంసా పత్రం అందజేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా శ్రీను బాబును సత్కరించారు.. ఈ సందర్భంగా

మూడు దశాబ్దాలుగా తన జర్నలిజం కెరీర్ లో చంద్రబాబు పాదయాత్ర తో పాటు  అనేక అంశాలు కవర్ చేసిన విషయాన్ని శ్రీనుబాబు ముఖ్యమంత్రికి తెలియజేశారు..*జర్నలిజం సేవారంగంలో*.గంట్ల శ్రీను బాబుకు 2026 రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం జర్నలిజం సేవా రంగంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేశారు.. కోవిడ్ సమయంలో లక్షలాది రూపాయలు వెచ్చించి అనేకమంది జర్నలిస్టులతో పాటు వృద్ధులు అనాధలు, దివ్యాంగులకు గంట్ల శ్రీనుబాబు  తన పరిధి మేరకు సహాయం అందించారు.. అలాగే నిరంతరం జర్నలిస్టుల సంక్షేమానికి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలు దేవాలయాలకు అనాధాశ్రమాలు వృద్ధాశ్రమాలకు తన పరిధి మేరకు ఆర్థికంగా సహాయం అందిస్తున్నారు.... ప్రతిష్టాత్మకమైన సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండల సభ్యుడిగా ప్రత్యేక ఆహ్వానితుడిగా గంట్ల శ్రీనుబాబు సేవలు అందించారు.. ఇక అనేక దేవాలయాలకు గౌరవ అధ్యక్షుడిగా ..పలు సంస్థలకు అధ్యక్షుడిగా. గౌరవ అధ్యక్షుడిగా శ్రీనుబాబు నిరంతరం తన సేవలు కొనసాగిస్తున్నారు..

*మూడు దశాబ్దాలు 23 అవార్డులు* 

గంట్ల శ్రీనుబాబు మూడు దశాబ్దాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు.. ఈ సందర్భంగా జాతీయ ..రాష్ట్ర.. జిల్లా స్థాయిలో 23 అవార్డులు ఆయనకు లభించాయి.. 2016.

. 2018... ఏపీ ప్రభుత్వం ఉగాది పురస్కారాలను చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందజేశారు.. తాజాగా 2026లో 

ఏపీ ప్రభుత్వం మూడోసారి ఉగాది పురస్కారాన్ని అందజేసింది..అలాగే 2019లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అక్కడ తెలంగాణ ప్రభుత్వం  పురస్కారం అందజేయగా ఢిల్లీ తెలుగు అకాడమీ జాతీయ అవార్డును గంట్ల శ్రీనుబాబు నాలుగుసార్లు స్వీకరించారు.. 2025 మేలో ఆంధ్ర పత్రిక వ్యవస్థాపకులు అలాగే అమృతాంజన్ సృష్టికర్త కాశీనాధుని  నాగేశ్వరరావు  పంతులు పేరిట విశ్వదాత పురస్కారాన్ని స్వీకరించారు.. ఇక విశాఖ జిల్లా అధికార యంత్రాంగం ద్వారా 6 సార్లు ఉత్తమ పాత్రికేయుడిగా పురస్కారాలు స్వీకరించారు.. అయితే తనకు లభించిన అన్ని పురస్కారాలు నిరంతరం ప్రోత్సాహం అందించిన తన జర్నలిస్టు మిత్రులకే అంకితమిస్తున్నట్లు  గంట్ల శ్రీనుబాబు పేర్కొన్నారు.. తనకు అండదండలుగా నిలిచిన తన కుటుంబ సభ్యులకు అలాగే జర్నలిస్టు ఇతర మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.. సింహాద్రినాథుడి ఆశీస్సులతో తాను ఈ ఉన్నత స్థాయికి రావడం జరిగిందని అలాగే సింహాచలం గ్రామంలో జన్మించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు శ్రీనుబాబు  చెప్పారు

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...