Skip to main content

జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 23.03.2026

ఈరోజు అనగా తేది 23.03.2026 న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు వారి అధ్యక్షతన ఏప్రిల్ 20 న జరుగబోవు చందనోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు వారు మాట్లాడుతూ ముందుగా ప్రైవేటు హాస్పిటల్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్ మరియు సిబ్బంది, ప్రోగ్రాం అధికారులు, అంబులన్స్లు మొదలగునవి సమన్వయపరిచి సమకూర్చడం జరిగింది. స్పెషలిస్ట్ డాక్టర్స్, స్టాఫ్ నర్స్లు, ఫార్మసిస్ట్లు, ఆశా కార్యకర్తలు, ఎ.ఎన్.ఎం లు, సూపర్ వైజర్ సిబ్బంది వీరందరినీ పర్యవేక్షించుటకు 10 మంది వరకు 3 షిఫ్ట్ లు వేయడం జరిగింది. మొత్తం సిబ్బంది 304 మంది డిప్యుటేషన్, 90 అంబులన్స్లు 2 షిఫ్ట్ లలో, కంట్రోల్ రూమ్ సిబ్బంది 12 మంది, రెఫరల్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్, గోపాలపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రం, కింగ్ జార్జ్ హాస్పిటల్, విక్టోరియా జనరల్ హాస్పిటల్, సిబ్బంది 3 షిఫ్ట్ లు, 6 పడకల తాత్కాలిక ఆసుపత్రులు కొండ పైన అందుబాటులో కలరని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు తెలియచేసారు.    

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి 

   విశాఖపట్నం

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...