Skip to main content

నా తండ్రి అడుగుజాడల్లో నా ప్రయాణం : ఎంపీ హరీష్ మాధుర్... ఘనంగా జి.ఎమ్.సి బాలయోగి 24వ వర్ధంతి... పలు సేవకార్యక్రమాలు, భారీ రక్తదాన శిభిరం...

అమలాపురం, విశాఖ సందేసం..కోనసీమ అభివృద్ధి పథంలో నడిపించిన లోకసభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి 24 వ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి పట్టణమలోని నల్లవంతెన సమీపంలోని బాలయోగి ఘాట్ వద్ద  ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా  ఎంపీ హరీష్ బాలయోగి నివాసంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమం ముగించుకున్న అనంతరం నివాసం వద్ద నుండి ఎంపీ హరీష్ ర్యాలీగా ఘాట్ కు చేరుకుని  ఘాట్ లోని బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

నివాళులు అర్పించిన పలువురు నేతలు…జీఎంసీ బాలయోగి వర్ధంతిని పురాషరించుకుని అమలాపురంలోని బాలయోగి ఘాట్ లో పలువురు నేతలు మాట్లాడుతూ బాలయోగి దేశానికి మరియు కోనసీమకు చేసిన సేవలను గుర్తుచేశారు.ఘాట్ లో నివాళులు అర్పించిన వారిలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధం పల్లం రాజు, కొత్తపేట జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, రాజోలు టీడీపీ ఇంచార్జ్ గొల్లపల్లి అమూల్య, చెల్లింగి శిరీష, చుట్టుగుళ్ల దుర్గవతి,బొంతు తులసి శ్రీదేవి,మాజీ ఎమ్మెల్యేలు చెల్లి వివేకానంద, చిల్లా జగదీశ్వరి, అయ్యాజీ వేమా, అల్లాడ సోంబాబు, మార్కెట్ కమిటీ చైర్మెన్ లు చిట్టూరి శ్రీవాస్, కేతా లక్ష్మి, చిక్కాల గణేష్, దేశంశెట్టి లక్ష్మీనారాయణ, మట్టపర్తి భారతి, భాజపా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, నల్లా పవన్, కల్వకోలను తాతాజీ, ఏడిద శ్రీను, మోకా సుబ్బారావు తదితరులు ఉన్నారు.ఉచిత మెగా వైద్య శిబిరం…రాజమండ్రి కిమ్స్ బొల్లినేని హాస్పిటల్ వారిచే ఎంపీ హరీష్ బాలయోగి మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసారు. సుమారు 600 వందల మంది వరకూ ప్రముఖ వైద్య నిపుణులచే గుండె మరియు నరాల సమస్యలు, ఎముకలు మరియు మోకాళ్ల నొప్పులు, శ్వాస సంబంధిత సమస్యలు, మహిళల ఆరోగ్య సమస్యలు, కంటి పరీక్షలు, పిల్లల ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ECHO, ECG, BP మరియు షుగర్ వంటి పరీక్షలు అక్కడే చేశారు. ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...