Skip to main content

జారీ చేసినవారు డా పి జగదీశ్వర రావు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి విశాఖపట్నం తేది: 24.03.2026

 

ఈరోజు అనగా తేదీ 24.03.2026 న ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా  జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీ ఎం.ఎన్.హరీందిర ప్రసాద్ వారి అధ్యక్షతన డా.పి.జగదీశ్వర రావు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి ఆద్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

దీనిలో భాగంగా జిల్లా కలెక్టరు వారు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఈ ర్యాలీ కలెక్టర్ ఆఫీసు నుండి జిల్లా పరిషత్ వరకు జరిగింది. తదుపరి జిల్లా పరిషత్ సమావేశం మందిరం లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మన జిల్లాలో గత సంవత్సరం 694 మందికి టి.బి. పరీక్షలు నిర్వహించగా 4,957 మందికి 2025 సంవత్సరంలో వ్యాధి నిర్ధారణ జరిగి, మందులు వాడించడం జరిగిందని తెలిపారు. టి.బి. మందులు క్రమం తప్పకుండా 6 నెలలు వాడినట్లు అయితే వ్యాది నుండి త్వరగా కోలుకోవచ్చునని తెలిపారు. మందులు వాడకంలో నిర్లక్ష్యం వహిస్తే "మొండి క్షయ' గా మారి, ప్రాణాంతకంగా పరిణమిస్తుందని తెలిపారు. టి.బి. ముక్తి భారత్ అభయాన్" లో భాగంగా వలనరబుల్ పాపులేషన్ అయినటువంటి స్మోకర్స్, డయాబెటిక్, ఆల్కహాల్, 60+ వయసు పై బడిన వారు, పాత టి.బి. కేసులు, వారి కాంటాట్స్ మరియు బీ.ఎం.ఐ 18 కంటే తక్కువ ఉన్న వారు అందరికి టి.బి. పరీక్షలు నిర్వహిస్థామని తెలిపారు." ప్రధాన మంత్రి టి.బి. ముక్త్ భారత అభియాన్ లో భాగంగా టి.బి. రోగులకు న్యూట్రిషన్ ఫుడ్ బాస్కె టి కిట్లను, C.S.R. ఫండ్స్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు. NALCO మరియు సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు 2025 వ తెలిపారు. వీరి సహకారంతో 2025 వ సంవత్సరంలో 60 లక్షల విలువైన 8205 మందికి ఫుడ్ బాస్కెట్ కిట్లను అందించడం జరిగిందని తెలిపారు

తదుపరి డా. పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు మాట్లాడుతూ క్షయ వ్యాధిని అందరం కలిసికట్టుగా అంతమొందించాలని క్షయ వ్యాధి రోగుల పట్ల ఎటువంటి వివక్ష చూపకూడదని తెలిపారు. అలాగే వ్యాధి నిర్ధారణ అయిన వారికి త్వరితగతిన మందులు ఇవ్వాలని వైద్య సిబ్బందికి సూచించారు 

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సి. ఇ.ఓ వారు మాట్లాడుతూ టీ.బీ లక్షణాలు అయినటువంటి దగ్గు, కఫం లో రక్తపు చారలు, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్న ఎడల త్వరితగతిన పరీక్షలు చేసుకొని వ్యాది నిర్ధారణ చేసుకోవాలని తెలిపారు 

తదుపరి జిల్లా పంచాయతీ ఆఫీసర్ శ్రీ శ్రీనివాసరావు వారు మాట్లాడుతూ డాక్టర్లు ప్రత్యక్ష దేవుళ్ళని టీబీ వ్యాధి నిర్ధారణలో మరియు చికిత్సను అందించడంలో వారు, వారి యొక్క సిబ్బంది ఈ కార్యక్రమంలో యొక్క సేవలు అనిర్వచనీయమని తెలిపారు 

తదుపరి గవర్నమెంట్ చాతి మరియు శ్వాస కోస వ్యాధుల  ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ సునీల్ కుమార్ వారు మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారణలో పని చేస్తున్నటువంటి ప్రతి సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇకపై మనందరం మరింత అంకిత భావంతో పనిచేయాలని తెలిపారు 

చివరగా జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టీబీ అధికారి అయినటువంటి డాక్టర్ ఆర్ రమేష్ గారు మాట్లాడుతూ గత సంవత్సరంలో 69,495 మందికి పరీక్షలు నిర్వహించగా  4,957 మందికి వ్యాధి నిర్ధారణ అయిందని వీటిలో 4809 మందికి సాధారణ టీబీగా నిర్ధారణ అయిందని 148 మందికి మొండి క్షయగా నిర్ధారణ అయిందని తెలిపారు సకాలంలో రోగులకు మందులు అందించడం త్వరగా వ్యాధి నుండి కోలుకోవడం జరుగుతుందని తెలిపారు. గత సంవత్సరం లో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి సిబ్బందికి సర్టిఫికెట్లు అందించడం జరిగిందని తెలిపారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా సుమారుగా 8 లక్షల పైబడి టిబి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ మరియు సెయింట్ జోసెఫ్ స్కూల్ ఆఫ్ హాస్పిటల్ వారికి వారి సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు 

"చేయి చేయి కలుపుదాం చేయని అంతమొందిద్దాం" అనే నినాదం తో ముందుకు వెళ్దాం అని తెలిపారు.

ఈ సమావేశం లో జిల్లా ప్రోగ్రాం అధికారులు, టిబి విభాగ సిబ్బంది మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


              జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి 

                         విశాఖపట్నం

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...