విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో రూపొందించిన 24 షార్ట్ ఫిల్మ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పెందుర్తి నియోజకవర్గ ఇంచార్జ్, APOILFED చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గౌ. శ్రీ గండి బాబ్జీ గారు పాల్గొన్నారు.
సమాజంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడం చాలా అవసరమని ఈ సందర్భంగా గండి బాబ్జీ గారు పేర్కొన్నారు.
విశాఖపట్నం సిటీ పోలీస్ వారు ప్రజల భద్రత కోసం సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఆయన అన్నారు.
ముఖ్యంగా యువత మరియు సామాన్య ప్రజలు సోషల్ మీడియా, ఆన్‌లైన్ లావాదేవీలలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, సామాజిక సేవకులు మరియు ప్రజలు పాల్గొన్నారు.కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన విశాఖపట్నం సిటీ పోలీస్ అధికారులను గండి బాబ్జీ గారు అభినందించారు.
ఇట్లు
గౌ శ్రీ గండి బాబ్జీ గారు Ex.MLA
APOILFED చైర్మన్
క్యాంపు కార్యాలయం
విశాఖపట్నం.

Comments
Post a Comment