ఈ రోజు అనగా తేది. 25.03.2026 డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి అధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయంలో మాతృ మరణాల పై సబ్ డిస్ట్రిక్ట్ మెటర్నిటీ డెత్ సర్వేలేన్స్ మరియు రెస్పాన్స్ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డా.పి.జగదీశ్వర రావు వారు మాట్లాడుతూ జనవరి 2026 నెలలో జరిగిన 2 మాతృ మరణాలు, పి.ఎం.పాలెం పట్టణ ఆరోగ్యకేంద్ర పరిదిలో 1 మాతృ మరణం, భవానిగార్డెన్స్ పట్టణ ఆరోగ్యకేంద్ర పరిదిలో 1 మాతృ మరణం పై సమీక్ష నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు మాట్లాడుతూ మాతృమరణాలు ఇకముందు సంభవించకుండా చూసుకోవాల్సిన భాద్యత సంబందిత ఆరోగ్య కేంద్రం యొక్క మెడికల్ అధికారి పై ఆధారపడి ఉంటుందని మరియు సంబందిత ANM సమయానికి గర్భిణీ స్త్రీ కి అవసరమైన సేవలను గుర్తించి అందజేయాలని తెలియచేశారు. ఇకముందు మాతృమరణాలు జరిగితే చర్యలు తీసుకోబడతాయని, హై రిస్క్ గర్భిణీ లు ప్రసవానికి వచ్చినప్పుడు కాలయాపన చేయకుండా KGH కు గాని VGH కు గాని రిఫర్ చేయాలని
ఆ విధంగా సురక్షిత కాన్పు జరిగేలా చూడాలని సూచించారు. ANM, ఆశా కార్యకర్తలు ఆడపిల్లలకు కౌమారదశ నుండి జరిగే మార్పులపై అవగాహన కల్పించాలని, గర్భిణీ స్త్రీలకు గర్బాధారణ నుండి అవగాహన కల్పించాలని సూచించారు. హైరిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి వారికి సమయానికి టీకాలు, పోషకాహారం మొ’’ ఆరోగ్య సేవలను అందేటట్లు చూడాలని తెలియచేశారు. హై రిస్క్ గర్భిణీ స్త్రీలకు బర్త్ ప్లానింగ్ సక్రమంగా చేయాలని మరియు ఆయా గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య స్థితి పట్ల అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ సమావేశoలో డా.ఆర్.నరేంద్ర సింగ్, APVVP, డా.ఉషాప్రసాద్, సూపరింటెండెంట్, VGH, డా.రజిత, జనరల్ మెడిసిన్, KGH, డా.పి.సుధామాలిని, గైనకాలజిస్ట్, KGH, డా.అపరంజిత, ఏనాస్తీషియా, KGH, డా.బి.ఉమావతి, DPMO, డా.టివిఎస్ నాయుడు, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్, డా.ఎన్.వి.సమత, WHO, శ్రీమతి ఎం.సత్యవతి, DPHNO, శ్రీమతి కే.నీలిమ, సిడిపిఒ, పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది, ప్రైవేటు హాస్పిటల్స్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆ విధంగా సురక్షిత కాన్పు జరిగేలా చూడాలని సూచించారు. ANM, ఆశా కార్యకర్తలు ఆడపిల్లలకు కౌమారదశ నుండి జరిగే మార్పులపై అవగాహన కల్పించాలని, గర్భిణీ స్త్రీలకు గర్బాధారణ నుండి అవగాహన కల్పించాలని సూచించారు. హైరిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి వారికి సమయానికి టీకాలు, పోషకాహారం మొ’’ ఆరోగ్య సేవలను అందేటట్లు చూడాలని తెలియచేశారు. హై రిస్క్ గర్భిణీ స్త్రీలకు బర్త్ ప్లానింగ్ సక్రమంగా చేయాలని మరియు ఆయా గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య స్థితి పట్ల అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ సమావేశoలో డా.ఆర్.నరేంద్ర సింగ్, APVVP, డా.ఉషాప్రసాద్, సూపరింటెండెంట్, VGH, డా.రజిత, జనరల్ మెడిసిన్, KGH, డా.పి.సుధామాలిని, గైనకాలజిస్ట్, KGH, డా.అపరంజిత, ఏనాస్తీషియా, KGH, డా.బి.ఉమావతి, DPMO, డా.టివిఎస్ నాయుడు, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్, డా.ఎన్.వి.సమత, WHO, శ్రీమతి ఎం.సత్యవతి, DPHNO, శ్రీమతి కే.నీలిమ, సిడిపిఒ, పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది, ప్రైవేటు హాస్పిటల్స్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం

Comments
Post a Comment