Skip to main content

27 సార్లు పాము కాటు… అయినా సేవలో వెనక్కి తగ్గని సుధాకర్ | రియల్ హీరో

పాములను పట్టి అడవుల్లో విడిచే సేవ… సుధాకర్‌కు ప్రజల ప్రశంసలు.

జగ్గయ్యపేట: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణ నివాసి వేమవరపు సుధాకర్ నియోజకవర్గానికి చేసిన  సేవకు విలువ కట్టలేనిది, ఎక్కడ పాములు కనిపించి ప్రజలు భయాందోళనలకు గురయ్యే సమయంలో వెంటనే అక్కడికి చేరుకుని వాటిని సురక్షితంగా పట్టి అడవుల్లో విడిచే సేవలో వేమవరపు సుధాకర్ విశేషంగా సేవలందిస్తున్నారు.

చిన్నతనం నుంచే పాములను పట్టుకోవడంలో నైపుణ్యం కలిగిన ఆయన ఇప్పటివరకు సుమారు 15 వేల పాములను పట్టుకుని అడవుల్లో విడిచినట్లు సమాచారం.

పాము కాటు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించడం,పాము కరిసిన వారికి తక్షణ ఫస్ట్ ఎయిడ్ అందించడం వంటి సేవలను కూడా సుధాకర్ అందిస్తున్నారు.

ఇప్పటివరకు సుమారు 20 మందిని పాము కాటు నుంచి రక్షించినట్లు ఆయన తెలిపారు.

సేవలందిస్తున్న సమయంలో ఇప్పటివరకు సుమారు 27 సార్లు పాములు కరిచినా కూడా ఆయన వెనుదిరగకుండా తన సేవలను కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం 60 సంవత్సరాల వయస్సులో కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా సేవలందించడం విశేషం.

సుధాకర్ చేస్తున్న సేవలను స్థానిక ప్రజలు అభినందిస్తూ, ఆయన సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొంటున్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...