Skip to main content

తెలుగు బాష అభివృధికి వన్నె తెచ్చిన కిమ్స్ సంస్థల అధినేత చైతన్య రాజు ఘనంగా జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహా సభల విజయోత్సవ సభ, ఈ సభల విజయానికి తోడ్పడిన వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన చైతన్య రాజు

 అమలాపురం, విశాఖ సందేసం...కిమ్స్ ప్రాంగణంలో 3వ ప్రపంచ తెలుగు మహా సభల విజయోత్సవ సభఫిబ్రవరి 28 వ తేదీ స్థిర వారం మరియు మర్చి 1 వ తేదీ ఆదివారం, రెండు రోజుల పాటు అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో ౩వ ప్రపంచ తెలుగు మహా సభలు  తెలుగు బాష అభివృధికి వన్నె తీసుకువస్తున్నా  కిమ్స్ సంస్థల అధినేత చైతన్య రాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.  రెండు తెలుగు రాష్ట్రాలనుండే కాక దేశ విదేశాల లోని అనేక మంది తెలుగు వారి నుండి విశేష స్పందన లభించిందని, సుమారు 50 వేల మందికి పైగా హాజరై ఈ సభలను విజయవంతం చేయడం చాలా సంతోషించదగిన విషయమని, ఈ ప్రపంచ తెలుగు మహా సభల నిర్వాహకులు, కిమ్స్ మరియు చైతన్య విద్యా సంస్థల స్థాపకులు మరియు చైర్మన్, 

మాజీ శాసన మండలి సభ్యులు మరియు గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్  కె.వి.వి సత్యనారాయణ రాజు(చైతన్య రాజు)  తెలిపారు. ఈ రెండు రోజుల కార్యక్రమాలకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఒరిస్సా రాష్ట్రాల గవర్నర్లు, అనేక మంది న్యాయ మూర్తులు, కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు, పాత్రికేయులు, ఉపాధ్యాయులు, రాష్ట్రం నలు మూలల నుండి కవులు, తెలుగు భాషాభిమానులకు; పోటీలు నిర్వహించుటలో మూడు నెలల పాటు తోడుగా ఉన్న తెలుగు పండితులకు, మరియు ముందుండి ఈ కార్యక్రమాలను నిర్వహించిన కిమ్స్ మరియు గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ సిబ్బందికి, ఈ ప్రపంచ మహా సభలను విజయవంతం చేయడంలో భాగస్వాములైన వారందరికీ పేరు పేరునా  కె.వి.వి సత్యనారాయణ రాజు(చైతన్య రాజు)  హృదయ పూర్వక కృతజ్ఞతలు  తెలిపారుతెలుగు భాషకు పూర్వ వైభవాన్ని కలిగించే ఉద్దేశ్యంతో ప్రారంభించిన ఈ ప్రపంచ తెలుగు మహా సభలు ప్రతి సంవత్సరం మరింత ఘనంగా నిర్వహించాలని, తద్వారా తెలుగు భాష సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షించడమే తమ ఆశయం అని ఆయన తెలిపారు. ఈ దిశలో మరింత కృషి చేసే ఉద్దేశ్యంతో "చైతన్య సారస్వత పరిషత్" అనే పేరుతొ ఒక సంస్థను స్థాపించామని, రాష్ట్ర మరియు విదేశాల నుండి అనేక మంది ప్రముఖ సాహితీవేత్తలు దానికి సలహాదారులుగా వ్యవహరిస్తారని, వారి సూచనల మేరకు తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడతామని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా భాగస్వాములై సహాయ సహకారాలు అందజేసి తెలుగు మహా సభలను విజయవంతం చేస్తూ తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు తోడ్పడాలని  చైతన్య రాజు  కోరారు. వచ్చే సంవత్సరం జనవరి 2 వ వారం లో 4 వ వార్షిక ప్రపంచ తెలుగు మహా సభలను రాజమహేంద్రవరంలో నిర్వహిస్తామని,   విద్యార్థులకు తెలుగు భాషా ప్రావీణ్యతా పోటీలు కూడా నిర్వహించి నగదు పురస్కారాలు ఇస్తామని ఆయన తెలిపారు. ఈ విజయోత్సవ సభలో సుమారు 400 మంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...