రామచంద్రపురం, విశాఖ సందేసం...రెండు కిడ్నీలు పాడై ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్న ఒక నిరుపేద కుటుంబానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అండగా నిలిచి ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు. వివరాల్లోకి వెళితే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ. పోలవరం మండలం కేసనకూరు పాలెం గ్రామానికి చెందిన వాసంశెట్టి శ్రీనివాస్ తన రెండు కిడ్నీలు పాడై అత్యవసర చికిత్స పొందుతున్నాడు. శ్రీనివాస్ కుటుంబ ఆర్థిక పరిస్థితిని స్థానిక కూటమి పార్టీ నాయకులు మంత్రి సుభాష్ దృష్టికి తీసుకువచ్చారు. వారి ధీనస్థితికి స్పందించిన మంత్రి సుభాష్ తక్షణ సహాయంగా రూ. 30 వేలు చెక్కును ఆర్థిక సహాయంగా అందించారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని ఆర్థిక సహాయం అందించిన మంత్రి సుభాష్ కు శ్రీనివాస్ ఆయన భార్య రేఖ, కూటమి పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు.
మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు
మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...

Comments
Post a Comment