విశాఖపట్నం కేజీహచ్ చిన్న పిల్లల విభాగం - వరల్డ్ ఆటిసం డే అవగాహన సదస్సు ను మెడికల్ సూపర్ ఇంటెండెంట్ డా.ఈ.వాణి గారు ,AMC Principal Dr. సంధ్యా రాణి గారు, పిడియాట్రిక్స్ HOD Dr.B.S. చక్రవర్తి గారు ,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి.జగదీశ్వర రావు గారూ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆటిజం తో బాధపడుతున్న పిల్లలకు వారి తల్లిదండ్రుల కు వైద్య అధికారులు అవగాహన ఇవ్వడం జరిగింది.
Expert Committee: డా . ప్రసన్న కుమార్ గారు HOD చైల్డ్ సైకియాట్రీ గవర్నమెంట్ మెంటల్ కేర్ హాస్పిటల్ మరియు డా. ఎం.పి.లలిత అసిస్టెంట్ ప్రొఫెసర్ చైల్డ్ సైకియాట్రీ గవర్నమెంట్ మెంటల్ కేర్ హాస్పిటల్ వారి చే ఆటిజం పిల్లల తల్లిదండ్రులకు గల ప్రశ్నలు, సందేహాల కు ఎక్స్పర్ట్స్ చే సమాధానాలు మరియు అవగాహన కల్పించడం జరిగింది.
మానసిక, శారీరక సమస్యలు, మానసిక: అభివృద్ధిలో ఆలస్యం వంటి సమస్యలు కలిగిన పిల్లలకు సమయానికి సరైన చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని వైద్యులు తెలిపారు. ఆటిజం అనే వ్యాధి చిన్నపిల్లలలో ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొన్నారు. పిల్లలు మాట్లాడటంలో ఆలస్యం, ఇతరులతో కలవకపోవడం, తనలో తాను ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ఈ లక్షణాలు గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రేమతో చూసుకోవాలని అన్నారు. సమాజంలో ఆటిజంపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమం జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రం - డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెంక్షన్ సెంటర్ వైద్య బృందం పాల్గొని ఆటిజం తో ఉన్న పిల్లల కు థెరఫీ లు ఏ విధం గా ఇస్తారన్న దాని మీద అవగాహన కల్పించారు.NGO సమస్తలు పాల్గొని వారికి సదుపాయాలు గురించి తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమం ను జిల్లా RBSK ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.బి.హారిక పర్యవేక్షణ లో నిర్వహించారు
Comments
Post a Comment