Skip to main content

ఉగాది సందర్భంగా 39 వ వార్డులో G.V.M.C పారిశుద్ధ కార్మికులకు డాక్టర్ జహీర్ అహ్మద్ గారు చీరలు పంపిణీ.....

ఉగాది పండుగను పురస్కరించుకొని,A.N. బీచ్ హాస్పిటల్ అధినేత, వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ జహీర్ అహ్మద్ గారు , రౌండ్ టేబుల్ సంస్థ సభ్యులుmaksood అహ్మద్  39 వ వార్డులో వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో G.V.M.C పారిశుద్ధ కార్మికులకు, వృద్ధులకు, పేద వాళ్లకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా 39వ వార్డులో ఉగాది పండుగ పురస్కరించుకొని G.V.M.C. పారిశుద్ధ కార్మికులకు, వృద్ధులకు,  పేదలకు చీరలను పంపిణీ చేయడం జరుగుతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అప్పారావు, సత్తిబాబు, అప్పలకొండ మరియు మహిళా సభ్యులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...