Skip to main content

ఏప్రిల్ 3న ‘రాకాస’ విడుదల

విశాఖపట్నంలో ఘనంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్విశాఖపట్నం, మార్చి 22 : మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా, యంగ్ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన సరికొత్త చిత్రం ‘రాకాస’. ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం విశాఖపట్నంలోని దశపల్ల హోటల్‌లో చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది.

విశాఖ అంటే ఎంతో ఇష్టం: నిర్మాత నిహారిక

ఈ సందర్భంగా నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ, ‘కమిటీ కుర్రాళ్లు’ వంటి భారీ విజయం తర్వాత తమ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై వస్తున్న మరో వైవిధ్యమైన చిత్రం ‘రాకాస’ అని తెలిపారు. విశాఖపట్నం బీచ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, అందుకే ఇక్కడికి షిఫ్ట్ అయిపోవాలని ఎప్పుడూ అనుకుంటానని ఆమె చమత్కరించారు. ఈ చిత్రంలో కామెడీ చాలా నిజాయితీగా ఉంటుందని, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి వంటి సీనియర్ నటుల రాకతో సినిమా స్థాయి పెరిగిందని పేర్కొన్నారు. హీరో సంగీత్‌తో తనకు ఇది రెండో సినిమా అని ఆమె గుర్తు చేశారు.

చందమామ కథలాంటి సినిమా: హీరో సంగీత్ శోభన్

హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ, ఇది ఒక ఫాంటసీ కామెడీ చిత్రమని, ఇందులో హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని తెలిపారు. దర్శకుడు విఠలాచార్య తీసిన పాత చిత్రాల మాదిరిగా, ఒక ‘చందమామ కథ’ విన్నట్టుగా ఈ సినిమా ఉంటుందని, ఫైనల్‌గా ఇదొక క్యూట్ లవ్ స్టోరీ అని వివరించారు.

అందరినీ అలరిస్తుంది: చిత్ర యూనిట్

హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ, సినిమా ప్రమోషన్స్ విశాఖ నుంచే ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాను పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఎంజాయ్ చేయవచ్చని తెలిపారు. నటుడు గెటప్ శ్రీను మాట్లాడుతూ, ఫాంటసీ కామెడీ బాగా పండిందని, హీరో సంగీత్ తన నటనతో అదరగొట్టారని కొనియాడారు. దర్శకురాలు మానస శర్మ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని చిత్ర బృందం ప్రశంసించింది.

జీ స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం సమ్మర్ కానుకగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు  పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...