Skip to main content

కూటమి ప్రభుత్వం దృష్టికి* *మరోసారి జర్నలిస్టులు పెండింగ్ సమస్యలు* *మార్చి 4న భారీ ర్యాలీ... మంత్రులు సమక్షంలో సభ* *అందరి సహకారంతో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించుకుందాం* *రేపు చలో విజయవాడ కార్యక్రమానికి శ్రీకారం*

అక్కయ్యపాలెం మార్చి 2రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను మరోసారి కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందామని
ఇందుకోసం చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని.. రాష్ర్ట వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల పెండింగ్ సమస్యల పరిష్కారానికే ఆయా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి (నేషనల్ అలెయన్స్ ఆఫ్ జర్నలిస్ట్స్), ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు పి.నారాయణ, ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసరావులు తెలిపారు. ఈ మేరకు సోమవారం అక్కయ్యపాలెం జంక్షన్ లోని ఒక ప్రైవేట్ హోటల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో  ఏపి వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్ కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ లు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో వీరు మాట్లాడుతూ రాష్ట్రంలో  జర్నలిస్టులకు సంబంధించిన  11 డిమాండ్ల సాధన కోసం చాలా కాలంగా 

తమ యూనియన్ లు ప్రయత్నాలు చేస్తున్నా యన్నారు.. అయితే ఇందులో అక్రిడేషన్ లు సమస్య కొంత కొలిక్కి వచ్చిందన్నారు. ఇక మిగిలిన డిమాండ్ లకు సంబంధించి మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని తమ రాష్ర్ట కార్యవర్గం చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ప్రధానంగా జర్నలిస్టుల ఇంటి కల నెరవేరలేదని ప్రభుత్వాలు మారుతున్నా కనీసం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇండ్లు కేటాయించడం లేదన్నారు. అలాగే జర్నలిస్టుల హెల్త్ ఇన్సూరెన్స్ ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ప్రమాధ భీమా పథకాన్ని పునరుద్దరించాలని , ఇతర రాష్ర్టాల్లో జర్నలిస్టులకు అమలు చేస్తున్న పెన్షన్ విధానం అమలు చేయాలని , మీడియా హక్కుల పరిరక్షణకు ప్రత్యేకంగా మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు కార్పొరేట్ సంస్థల నుంచి ఉచితంగా విద్య, వైద్యం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తామంతా కోరుతున్నామన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు అందజేస్తున్న తరుణంలో సమాజం కోసం పాటు పడుతున్న జర్నలిస్టులకు వారి కుటుంబాలకు కార్పొరేట్ సంస్థల నుంచి ఉచితంగా విద్య, వైద్యం అందించాలన్నారు. జర్నలిస్టులకు

ప్రముఖుల పేరుతో ఉన్న అవార్డులు అందజేయాలని.. వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలని..

జర్నలిస్టులకు సంబంధించిన కమిటీలు ఏర్పాటు చేయాలని..

కార్మిక భీమా సదుపాయం కల్పించాలని .. మొత్తం 

11 డిమాండ్లతో ఇప్పటికే తాము దశల వారీగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇతర ప్రముఖులకు వినతిపత్రాలు అందజేశామన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో మరోసారి వర్కింగ్ జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వంలో పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని తమ రాష్ర్ట కార్యవర్గం నిర్ణయించిందన్నారు. 

 *రేపు చలో విజయవాడ*

వర్కింగ్ జర్నలిస్టుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ మార్చి 4 న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాలని తమ రాష్ర్ట కార్యవర్గం నిర్ణయించిందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్లులు  పి.నారాయణలు తెలిపారు. ఆరోజు ఉదయం విజయవాడలో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామని క్రమేపీ అది సభగా మారుతుందన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న జర్నలిస్టుల సభకు అతిధులుగా రాష్ర్ట సమాచార,పౌరసంబందాల శాఖామంత్రి కొలుసు పార్ధసారధి, కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ లను ఆహ్వానించడం జరిగిందన్నారు. మంత్రులు హాజరుకానున్న ఈ సభలో జర్నలిస్టుల సమస్యలు వివరించి వాటి పరిష్కారాన్ని కోరుతామన్నారు. కావున రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వీరు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్,  ఆర్గనైజింగ్ సెక్రటరీ లు రవికుమార్, ప్రసాద్  ఉపాధ్యక్షులు ఎన్ రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి గణేష్ రెడ్డి, నగేష్ బాబు బ్రాడ్ కాస్ట్ అధ్యక్షులు ఈశ్వరరావు, కార్యదర్శి కింతాడ మదన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ  దేవత్రినాథ్, కార్యదర్శిలు శేషు, నేల రాజు, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్,కార్యదర్శి బొబ్బర ప్రసాద్, సంయుక్త కార్యదర్శి రాజశేఖర్,శర్మ, జగన్నాథం,హరి

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...