కువైట్‌లో టిడిపి రక్తదాన శిబిరానికి భారీ స్పందన… కార్యకర్తల సేవాభావాన్ని కొనియాడిన పల్లా* *▪️ ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరగనున్న టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు… ఎన్టీఆర్ ఆశయాలకు ప్రపంచవ్యాప్త గౌరవం* *-- టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు*
ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల సామాజిక న్యాయమే లక్ష్యంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించబడనున్నట్లు తెలిపారు. అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు సుమారు 90 దేశాల్లో ఈ వేడుకలు జరుగుతుండగా, అమెరికాలో 25 పట్టణాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని పేర్కొన్నారు. యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ గల్ఫ్ దేశాల్లో, అలాగే యూరప్ దేశాలు, యూకే, సింగపూర్, మలేషియా, ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో కూడా టిడిపి శ్రేణులు ఉత్సాహంగా ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు.
విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ గారి ఆశయాలను విశ్వవ్యాప్తంగా చాటుతూ ముందుకు సాగుతున్నారని పేర్కొంటూ, ఇది పార్టీ విస్తృతి, విశ్వాసానికి నిదర్శనమన్నారు. ఎన్టీఆర్ గారు ప్రతిష్టించిన ఆత్మగౌరవ భావజాలం నేడు దేశ విదేశాల్లో బలంగా పాతుకుపోయిందని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుండగా, యువ నాయకత్వాన్ని సమర్థంగా ముందుకు తీసుకెళ్తున్న మంత్రి శ్రీ నారా లోకేష్ గారి కృషి టిడిపికి కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తోందని పల్లా గారు పేర్కొన్నారు. అనుభవం–యువశక్తి కలయికతో పార్టీ భవిష్యత్తు మరింత శక్తివంతంగా రూపుదిద్దుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Comments
Post a Comment