Skip to main content

ఏపీలో జర్నలిస్టులను విస్మరించము ..నిర్లక్ష్యం చేయం* *సమస్యలు పరిష్కారానికి ముందుంటా* *దశలవారీగా పరిష్కారం చూపిస్తా* *జర్నలిస్టుల సంక్షేమ నిధికి 5 లక్షలు విరాళం* *రాష్ట్ర సమాచార పౌరసరఫరాల మంత్రి కొలుసు పార్థసారథి*

విజయవాడ : మార్చ్ 4
జర్నలిస్టుల పట్ల తమ ప్రభుత్వానికి సానుకూలతే ఉందని.. వివిధ సందర్భాల్లో జిల్లాల్లో జర్నలిస్టు సంఘాల నాయకులు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను చర్చిస్తుంటామని.. ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తుంటామని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కే పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (ఏపీబీజేఏ)  సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన "చలో విజయవాడ" కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచీ చాలా పెద్ద సంఖ్యలో హాజరైన జర్నలిస్టులు మహాత్మాగాంధీ రోడ్డు రాఘవయ్య పార్క్ సెంటర్ నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు భారీ ర్యాలీ జరిగింది. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో "ఫెడరేషన్" రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వెంకట్రావు అధ్యక్షతన సభ జరిగింది. రాష్ట్ర నాయకులు తెలిపిన ఆయా సమస్యలపై మంత్రి స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి యధాశక్తి కృషి చేస్తానని పేర్కొన్నారు. జర్నలిస్టుల ముఖ్య సమస్యలన్నింటినీ సీఎంతో చర్చించి పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. "జర్నలిస్టులను విస్మరించం.. నిర్లక్ష్యం చేయం" అని తెలిపారు. జర్నలిస్టుల ఆరోగ్య బీమా పథకంలో అంతరం లేకుండా నిరవధికంగా కొనసాగేలా చూస్తానన్నారు. ఏడాదికి రెండుసార్లైనా జర్నలిస్టులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలన్న విజ్ఞప్తిని ప్రస్తావిస్తూ ఐఎంఏ, పెద్ద ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చించి జర్నలిస్టులకు లబ్ధి కలిగేలా చూస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమ నిధిని పెంచి ఫలాలు అందేలా.. కార్యాచరణ ఆలోచిస్తామని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ఈ పథకానికి తాను వ్యక్తిగతంగా ఐదు లక్షల రూపాయలు అందజేస్తానన్నారు. జర్నలిస్టులకు ఇళ్లు.. ఇంటి స్థలాల అభ్యర్థనను ప్రస్తావిస్తూ ఈ వరకే ఉన్న పథకంలో జర్నలిస్టుల్ని కలిపే విషయం సానుకూలంగా పరిశీలిస్తామన్నారు.  జర్నలిస్టులపై దాడుల్ని ఖండించి తీరతామన్నారు. జర్నలిస్టుల పిల్లలకు విద్యాసంస్థల్లో ఉచితంగా  అసెంబ్లీలో ప్రతిపక్షం లేకున్నా.. మీడియాలో వస్తున్న వివిధ సమస్యలను ప్రభుత్వం చర్చిస్తుంటుందని మంత్రి తెలిపారు. సోషల్ మీడియా, యూట్యూబ్ లలో తరచూ ఫేక్ న్యూస్ వస్తున్నందున మిగతా జర్నలిస్టుల మీద కూడా కొంత విముఖత లేకపోలేదన్నారు. అబద్ధాల.. తప్పుడు వార్తల విషయంలో ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల కంటే ప్రజల సంక్షేమానికి ఎక్కువ మొత్తంలో కేటాయిస్తోంది ఆంధ్రప్రదేశేనని ఆయన చెప్పారు.  "ఫెడరేషన్" ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు మాట్లాడుతూ "సేవ్ జర్నలిజం.. ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్" అని జర్నలిస్టుల జాతీయ సంఘం పేర్కొన్న అంశాన్ని తొలుత ప్రస్తావించారు. తమ సంఘంలో 7 వేల మందికి పైగా సభ్యులున్నారంటూ వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వివరించారు. జర్నలిజం వృత్తి పెద్ద ప్రమాదంలో పడింది. జర్నలిస్టులకున్న కొద్దిపాటి చట్టాలను కూడా కేంద్రం రద్దు చేసింది. మాకు ఏ సదుపాయాలున్నాయో తెలియదు. జర్నలిస్టుల పరిస్థితులు అన్నింటినీ అధ్యయనం చేసేందుకు మీడియా కమిషన్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది అని ఆంజనేయులు పేర్కొన్నారు. కొన్ని వార్తలు విషయంలో అప్పుడప్పుడు రాజకీయ నాయకులు మరికొన్ని సంఘ వ్యతిరేక శక్తుల నుండి దాడులు ఎదుర్కొన్న సందర్భాలు గతంలో ఉంటే ఇప్పుడు అధికారుల నుండే జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి. కేసులు పెడుతున్నారు. నోటీసులు ఇస్తున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు నెలకు రూ. 3 వేల చొప్పున మూడు సంవత్సరాల పాటు పరిహారం అందించే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కనీసం ఒక్క వృద్ధాశ్రమాన్ని జర్నలిస్టుల కోసం కేటాయించాలని ఆంజనేయులు అభ్యర్థించారు.

దేశంలో 18 రాష్ట్రాల్లో పెన్షన్ ఇస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం వెయ్యి.. 1200 మించి రిటైర్డ్ జర్నలిస్ట్స్ ఉండరు.  నెలకు కొంత మొత్తం పెన్షన్ గా ఇస్తే అదో సామాజిక భద్రతగా  ఉంటుంది. మన రాష్ట్రంలో కూడా పెన్షన్ అమలు చేయాలని కోరుతున్నామని వెంకటరావు తన అధ్యక్షోపన్యాసంలో పేర్కొన్నారు. చాలాకాలంగా జర్నలిస్టుల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి.  అందరి సమస్యలూ జర్నలిస్టులు వెలికితెస్తారు... మరి వారి సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదు అని ఆవేదన వ్యక్తంచేశారు. జర్నలిస్టుల పరిస్థితి మరీ అధ్వానంగా  ఉంది. వాటి పరిష్కారం కోసం పలుమార్లు మంత్రికి, అధికారులకు వినతిపత్రాలు ఇచ్చాం. ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయని  పేర్కొన్నారు. తొలుత "ఫెడరేషన్" ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎం.బి.నాథన్ స్వాగతం పలుకుతూ 

రాష్ట్రవ్యాప్తంగా  జర్నలిస్టులు ప్రధానంగా 14 సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కలిమిశ్రీ నాయకులను వేదికపైకి ఆహ్వానించారు. "ఫెడరేషన్", ఏపీ బీజేఏ, ఎన్ఏజే నాయకులు కొండయ్య, అమరయ్య, గంట్ల శ్రీనుబాబు..ఎం. శ్రీనివాసరావు, మంజరి, శాంతిశ్రీ,  ఇంకా ఆ సంఘాల జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు వేదికను అలంకరించారు. మంత్రికి ఆయా సమస్యలను వివరిస్తూ అ సంఘాల రాష్ట్ర నాయకులు వినతిపత్రం అందించారు. తొలుత "కళారత్న" నాట్యగురు భాగవతుల సౌమ్య శిష్యులు ప్రదర్శించిన నృత్యాలు ఆహూతుల్ని విశేషంగా అలరించాయి. సౌమ్యను మంత్రి ద్వారా సన్మానించారు. నర్తకీమణులకు సర్టిఫికెట్లు అందించారు. ప్రజానాట్యమండలి గాయకులు అనిల్, కవి, అప్పన్న పాడిన అభ్యుదయ గీతాలు అలరించాయి.

 *అద్భుత ప్రదర్శన* 

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ నుండి పెద్ద సంఖ్యలో "ఛలో విజయవాడ" కార్యక్రమానికి విచ్చేశారు. కొన్ని జిల్లాల నుండి వేకువజామనే నగరానికి చేరుకున్నారు. బస్సులు, రైళ్లు, కార్లు తదితర మార్గాల ద్వారా ర్యాలీకి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 11 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని నిర్వాహకులు ప్రకటించినా పది గంటలకే చేరుకోనారంభించారు.11:30 గంటల వరకు ఆయా జిల్లాల నుండి జర్నలిస్టులు వస్తూనే ఉన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి.. మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి.. పెన్షన్ సదుపాయం కల్పించాలి.. మీడియా అకాడమీకి గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి.. జర్నలిస్టులకు వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలి.. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి తదితర నినాదాలతో మహాత్మా గాంధీ రోడ్డు మారుమోగింది. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ రద్దీని అదుపుచేయడానికి.. ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి  అనివార్యంగా రోప్ పార్టీని ఏర్పాటు చేయాల్సొచ్చింది. ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ర్యాలీ చేయడం ఇటీవల కాలంలో ఇదే పేర్కొనదగినది. ర్యాలీకి సిఐటియు రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి తదితరులు మద్దతు పలికారు. ఫెడరేషన్ రాష్ట్ర నాయకులతోపాటు ఆయా జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు.. కార్యవర్గాలు.. ఇతర సభ్యులు.. మహిళలు సహా పెద్ద సంఖ్యలో పాల్గొనడం నగర ప్రజానీకాన్ని అబ్బురపరిచింది.

               Sharma K V  Editor

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...