అల్లవరం, విశాఖ సందేసం.. అల్లవరం మండలం గోడి గ్రామం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం గోడి బాలురు గురుకుల పాఠశాలలో ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 8వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ . శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 & 7 తరగతులకు ఎంపిక చేసుకున్న కేంద్రంలో ఉదయం 10 గంటల నుండి 11:30 వరకు 8,9, & 10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నము 2.00 గంటల నుండి 3.30 వరకు పరీక్ష ఉంటుందని అన్నారు.హాల్ టికెట్లను వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని, ఆధార్ కార్డ్ మరియు పాస్ సైజ్ ఫోటో తప్పనిసరిగా తీసుకోని రావాలని సూచించారు.
---

Comments
Post a Comment