Skip to main content

విశాఖ ఉక్కు మాజీ డీజీఎం పెనుమత్స సాయి బాబురాజుకు సేవలో ఉక్కు సంకల్పం – 64 ఏళ్ల వయసులో 22వ సారి రక్తదానం

విశాఖపట్నం:సేవా భావం, మానవత్వం, సామాజిక బాధ్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ విశాఖ ఉక్కు నగరానికి చెందిన శ్రీ పెనుమత్స సాయి బాబురాజు గారు మరోసారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం (RINL)లో ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగంలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా (DGM) సేవలందించి పదవీ విరమణ పొందిన ఆయన, సేవలో మాత్రం ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.

64 ఏళ్ల వయస్సులోనూ ఆయన సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, ప్రతి ఆదివారం ఉక్కునగరం సమితి సేవాదళ సభ్యునిగా నారాయణ సేవ కార్యక్రమంలో నియమితంగా పాల్గొంటున్నారు.

 హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఒడిశా రాష్ట్రంలోని రాయగడకు చెందిన ఒక రోగికి ఈ రోజు అత్యవసరంగా అవసరమైన O పాజిటివ్ రక్తాన్ని అందిస్తూ శ్రీ సాయి బాబురాజు గారు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఇది ఆయన చేసిన 22వ రక్తదానం కావడం విశేషం.

వయస్సును లెక్కచేయకుండా మానవతా దృక్పథంతో, సేవాభావంతో స్పందించిన శ్రీ సాయి బాబురాజు గారి సేవా తపనను సేవా సంస్థలు, సహచరులు మరియు సమాజంలోని పలువురు హృదయపూర్వకంగా అభినందించారు. ఆయన చూపిస్తున్న ఈ సేవా స్పూర్తి యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు.

శ్రీ సాయి బాబురాజు గారి మానవతా విలువలు, సేవా దృక్పథం, సామాజిక బాధ్యత సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పలువురు ప్రశంసించారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...